»   » ఇంత అందాన్ని ఇష్టపడని వారు ఎవరుంటారు?(ఫోటోలు)

ఇంత అందాన్ని ఇష్టపడని వారు ఎవరుంటారు?(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'నువ్విలా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ యామి గౌతమ్. చండీగర్‌లో పుట్టిపెరిగిన ఈ భామ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బిజీ అవుతోంది. గతంలో యామి గౌతమి రవిబాబు దర్శకత్వంలో 'నువ్విలా' చిత్రంలో నటించింది. ఈచిత్రం షూటింగ్ సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఇద్దరూ ఒకే హోటల్‌లో స్టే చేసారు. అప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటన రవిబాబుకు వివరించగా దాన్నే ఆయన 'అవును' పేరుతో సినిమా రూపంలోకి తెచ్చారు.

ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. నితిన్ హీరోగా రూపొందుతోన్న 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రంలో నటిస్తోంది. కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తుండగా, గౌతం మీనన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న 'యుద్ధం' చిత్రంలో నటిస్తుంది. యుద్ధం చిత్రానికి భారతి గణేష్ దర్శకత్వం వహిస్తుండగా నట్టికుమార్ నిర్మిస్తున్నారు.

తెలుగు, ఇతర దక్షిణాది భాషల సినిమాలతో పాటు, బాలీవుడ్లోనూ తన అవకాశాలు పెంచుకునే ప్రయత్నంలో ఉన్న యామీ గౌతమ్ హాట్ ఫోటో షూట్లతో ఫిల్మ్ మేకర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా విడుదలైన యామీ గౌతమ్ హాట్ ఫోటోలు చూస్తే.....ఇంత అందమైన భామను ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? అనే ఆలోచన రాక తప్పదు. 24 ఏళ్ల యామీకి మంచి సినీ భవిష్యత్ ఉందనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

యామీ గౌతం

యామీ గౌతం

సినిమా రంగంలో అడుగు పెట్టాలనే ఉద్దేశ్యంతో 20 ఏటనే ముంబై షిప్ట్ అయిన యామీ గౌతమ్ పలు టెలివిజన్ కార్యక్రమాలతో తన కెరీర్ ప్రారంభించింది.

సినీ రంగ ప్రవేశం

సినీ రంగ ప్రవేశం

2010 కన్నడలో తెరకెక్కిన ‘ఉల్లాస ఉత్సాహ' చిత్రం ద్వారా యామీ గౌతమ్ తన సినీరంగ ప్రవేశం చేసింది.

వరుస అవకాశాలు

వరుస అవకాశాలు

కన్నడ ‘ఉల్లాస ఉత్సాహ' చిత్రం తర్వాత యామీ గౌతమ్ వరుస అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్, హిందీలో వికీ డోనర్, అమన్ కి ఆశా, పంజాబీలో ఏక్ నూర్; మళయాలంలో హీరో, తమిళంలోనూ ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

టీవీ కార్యక్రమాలు

టీవీ కార్యక్రమాలు

చాంద్ కి ప్యార్ చలో, రాజ్ కుమార్ ఆర్యన్, యే ప్యార్ న హోగా కం, మీటి చూరి నెం.1, కిచెన్ చాంపియన్ సీజన్ 1 అనే టెలివిజన్ కార్యక్రమాల్లో యామీ గౌతం నటించింది.

అవార్డులు

అవార్డులు

ఆమె హిందీలోనటించిన ‘వికీ డోనర్' చిత్రంనికి గాను పలుఅ వార్డులు దక్కించుకుంది. బోరోప్లస్ గోల్డ్ అవార్డ్, బిగ్ స్టార్ ఎంటర్టెన్మెంట్ అవార్డు, జీ సినీ అవార్డు, IIFA అవార్డులు దక్కించుకుంది.

English summary
Yami Gautam is an Indian film and television actress. Her initial appearances were on Indian television commercials and soap operas like Chand Ke Paar Chalo and Yeh Pyar Na Hoga Kam. In 2010, she made her cinematic debut with Kannada film Ullasa Utsaha, co-starring Ganesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu