తన కూతురుతో ఆ హీరో ఎఫైర్ ఉందని ముందే తెలుసా? అందుకే స్వీట్లు..?

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ నటుడు పులకిత్‌ సామ్రాట్‌, భార్య శ్వేతా రోహిరాలు విడిపోవడం బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది. అందుకు కారణం అతనిలో కలిసి నటించిన హీరోయిన్ గౌతమ్ కారణం అని, ఆమెతో ఎఫైర్ పెట్టుకున్న పులకిత్...కావాలనే భార్యకు దూరం అయ్యాడంటూ చాలా ప్రచారం జరిగింది.

పులకిత్ భార్య శ్వేత రోహిరా కూడా ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదంతా గతేడాది దీపావళికి ముందు చోటుచేసుకుంది. పుల్కిత్‌ శ్వేతాతో గొడవపడి ఢిల్లీలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయాడు. వెళ్లిన రెండు రోజులకే యామి తల్లిదండ్రుల నుంచి పుల్కిత్‌కి స్వీట్‌ బాక్స్‌ అందినట్లు తాజాగా వార్తలు వెలుగులోకి వచ్చాయి. పుల్కిత్‌ తల్లిదండ్రులు కూడా స్పందించి వెంటనే వాళ్లకి కూడా స్వీట్స్‌ పంపినట్లు శ్వేతకి స్నేహితులు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.

Yami's parents sent sweets to Pulkit

సాధారణంగా దీపావళి సందర్భంగా ఒకరికొకరు స్వీట్లు పంపుకోవడం ఉత్తరాదిన ఆనవాయితీ. అదే సమయంలో వారు స్వీట్ బాక్సులు పంపుకోవడంతో ఎవరికీ పెద్దగా అనుమానం రాలేదు. ఇపుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ... పులకిత్, శ్వేతా రోహిరా విడిపోయిన సందర్భంగానే వారు స్వీట్లు పంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. శ్వేతా అప్పుడు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఇపుడు ఆమెకు అసలు విషయం అర్థమైందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

ఈ వ్యవహారం బట్టి..... పులకిత్‌-యామి ఎఫైర్ విషయం ఈ ఇద్దరి తల్లిదండ్రులకు కూడా తెలుసని, మీడియాకు కూడా విషయం తెలియడంతో.. ఈ జంట మరింత పబ్లిక్ అయ్యారని టాక్. మీడియాతో పాటు ఎవరేమనుకున్నా ఫర్వాలేదు, మా ఇష్టం వచ్చినట్లు ఉంటాం అనే విధంగా ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టారు. యామితో తను కలిసున్న సమయంలో కొందరు మీడియా వారు ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా వారిపై పులకిత్ దాడికి దిగినట్లు కూడా ఆ మధ్య ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ప్రెస్ మీట్లో కూడా శ్వేతతో తన బంధం ముగిసినట్లే అని ప్రకటించాడు పులకిత్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X