»   » అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ సెన్సార్ రిపోర్ట్

అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న 'యముడికి మొగుడు' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ అయింది. ఈ చిత్రానకి క్లీన్ యూ వస్తుందని అంతా అనుకున్నప్పటికీ కొన్ని సీన్లపై సెన్సార్ బోర్డ్ సభ్యులు అభ్యంతరం తెలుపుతూ ఈ సర్టిఫికెట్ జారీ చేసారు.

కమెడీ నేపథ్యంలో సాగే ఈచిత్రం డిసెంబర్ 27న గ్రాండ్‌గా విడుదలవుతోంది. 'సుడిగాడు' లాంటి భారీ విజయం సాధించిన చిత్రం తర్వాత వస్తున్న నరేష్ మూవీ కావడంతో దీనిపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అదే సమయంలో కొందరు ఇది రోటీన్ యమలోకం బ్యాక్ డ్రాప్ సినిమా అయి ఉంటుందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

దర్శక నిర్మాతలు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రం...విభిన్న కథాంశంతో సోషియో ఫాంటసీకి వినోదాన్ని మేళవించి రూపొందిచిన మూవీ. అల్లరి నరేష్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈచిత్రంలో ఉంటాయని అంటున్నారు. మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్ హీరో కావడంతో ఈ చిత్రానికి బిజినెస్ బాగానే అవుతోంది.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో షాయాజీ షిండే, రమ్య కృష్ణ, నరేష్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, కృష్ణ భగవాన్, రఘుబాబు, చలపతిరావు, ఏవీఎస్, మాస్టర్ భరత్, సత్యకృష్ణ, సన తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, ఛాయాగ్రహణం, కె. రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: కిరణ్ కుమార్, ఫైట్స్: గణేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: రామ్ చౌదరి, సమర్పణ: ధనలక్ష్మి అడ్డాల, నిర్మాత: చంటి అడ్డాల, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

English summary
Allari Naresh's coming up release 'Yamudiki Mogudu' received U/A certificate. E Sattibabu is the director of this movie and it is touted to be a socio fantasy mas entertainer like in the lines of Naresh mark amusement. Addala Chanti producing this movie on friendly movies banner.
Please Wait while comments are loading...