»   » యూఎస్ రిపోర్ట్: యముడికి మొగుడు, సారొచ్చారు

యూఎస్ రిపోర్ట్: యముడికి మొగుడు, సారొచ్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేష్ నటించిన 'యముడికి మొగుడు' చిత్రం యూఎస్ బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలను సాధించకుండా డీలా పడి పోయింది. నరేష్ నటించిన గత చిత్రం 'సుడిగాడు'తో పోలిస్తే 'యముడికి మొగుడు' చిత్రం కేవలం 10 శాతం బిజినెస్ మాత్రమే చేయడం గమనార్హం. అయితే రవితేజ నటించిన సారొచ్చారు చిత్రం మాత్రం ఫర్వాలేదనే విధంగా ఫలితాలనిస్తోంది.

సుడిగాడు చిత్రం అల్లరి నరేష్ కెరీర్లోనే యూఎస్ మార్కెట్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రం అక్కడ 29 స్క్రీన్లలో విడుదలై ఓపెనింగ్ వీకెండ్‌లో రూ. 69.83 లక్షలు ($125,484) వసూలు చేసింది. ఈ నేపథ్యంలో 'యముడికి మొగుడు' చిత్రం మంచి ఫలితాలను సాధిస్తుందని అంతా భావించారు. కానీ అంచనాలు తలక్రిందులయ్యాయి. 16 స్ర్కీన్లలో ఇక్కడ విడుదలైన 'యముడికి మొగుడు' చిత్రం Rs 7.19 లక్షలు ($13,132) మాత్రమే సాధించింది.

ఇక రవితేజ నటించిన 'సారొచ్చారు' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో మంచి ఫలితాలనే సాధించింది. 15 స్క్రీన్లలో విడుదలైన 'సారొచ్చారు' రెండో వారాంతంలో $7,037 వసూలు చేసింది. టోటల్ గా 10 రోజుల్లో ఈచిత్రం Rs 31.24 లక్షలు ($57,080) వసూలు చేసింది.

English summary
Comedy King Allari Naresh's latest Telugu movie Yamudiki Mogudu has opened to a poor response at the USA Box Office. The first weekend collection of the film is average in the country. Its business is 10% of what Naresh's previous release Sudigadu has collected in this market. Whereas Ravi Teja's last week release Sarocharu is still holding well there.
Please Wait while comments are loading...