For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కుక్క కూడా తీర్పు చెబుతుంది, శవాలమీద డబ్బులేరుకుంటున్నారు: రోజా "షో" పై యండమూరి వ్యాఖ్యలు

  |

  రచ్చబండ షో ఇప్పుడు బుల్లి తెరపై హాట్‌ టాపిక్‌ అయ్యింది. జబర్‌దస్త్‌లా సాఫ్ట్‌గా నవ్వుతూ ఈ కార్యక్రమంలో రోజా కన్పించడానికి వీల్లేదు. అసలే ఎమ్మెల్యే, పైగా డైనమిక్‌. ఇంకేముంది, అదిలించేసి.. అదరగొట్టేస్తున్నారు రోజా. అతి తక్కువ కాలంలోనే ఈ షో మంచి రేటింగ్స్‌ సంపాదించుకుంది అదే స్థాయిలో విమర్శలని కూడా మూటగట్టుకుంది. అసలు ఈ షో కి వచ్చేవాళ్ళు నిజమైన దంపతులేనా? లేదంటే దబ్బులిచ్చి మరీ ఇలాంటి గొడవలతో వాళ్ళని ఈ షో కోసం తీసుకువస్తున్నారా అన్న అనుమానాలూ ఉన్నయి.

  సుమలత, జీవిత

  సుమలత, జీవిత

  ఇప్పటికే ఆ షో లలో హోస్ట్‌గా చేసిన సుమలత, జీవిత రాజశేఖర్ ఇద్దరూ రకరకాల విమర్శలతో తప్పుకున్నారు. ఒక షో కి రానన్నఒక భర్తని, జీవితా రాజశేఖర్ అనుచరులు బెదిరించినట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ ఘటనలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

  ఓవరాక్షన్

  ఓవరాక్షన్

  అయినా సరే ఇక్కడ వచ్చే పాపులారిటీ రెమ్యూన రేషన్ మిగతా ఆఫర్లకంటే ఎక్కువగా ఉండటం తో ఈ షో చేయటానికి ఒప్పుకుంది రోజా. కానీ ఈ మధ్య ఆ షోలో రోజా ఓవరాక్షన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. నాలుగు గోడల మధ్య జరగాల్సిన గొడవను, షో పేరుతో నాలుగు కోట్ల మంది చూసేలా వాళ్ల పరువును రోడ్డుకు తెప్పిస్తున్నారు.

  Jabardasth Hyper Aadi Videos Are Trending in Youtube

  "బీప్...బీ..ప్"

  ఈ షో ఎంత దారుణం అంటే టీ.ఆర్.పి రేటింగ్స్ కోసం గొడవలను కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కింద చిత్రీకరిస్తున్నారు. ఇక అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో మాటలకంటే "బీప్...బీ..ప్" మంటూ వచ్చే ఎడిట్ సౌండే ఎక్కువ సార్లు వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ప్రేక్షకులకు ఆ బూతు అర్థమయ్యేలాగా మొదటి అక్షరం లేదా చివరి అక్షరం వినిపిస్తారు.

  ఇంటి పరువును బజారుకీడుస్తున్నారు

  ఇంటి పరువును బజారుకీడుస్తున్నారు

  నిజంగా ఈ షోస్ ద్వారా కాపురాలని చక్కబెడుతున్నారన్న విషయాన్ని పక్కన పెడితే ఒక ఇంటి పరువును బజారుకీడుస్తున్నారనే విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు. అన్న విమర్శలనుంచీ అసలు ఇలాంటి టీవీ షోలని రద్దు చేసేయ్యాలనే వాదన కూడా పైకి వచ్చేదాకా వెళ్ళింది.

  యండమూరి వీరేంద్రనాథ్

  యండమూరి వీరేంద్రనాథ్

  ఈ తరహా కార్యక్రమాల్లో వాస్తవాల గురించి ఓ న్యూస్ ఛానెల్ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ను ప్రశ్నించింది. మానసికంగా ఆనందంగా ఉండే వాళ్లెవ్వరూ ఇలాంటి షోలు చూడాల్సిన అవసరం లేదని యండమూరి సమాధానమిచ్చారు. ఇలాంటి షోలని చూడటం వల్ల మానసిక ప్రశాంతత కూడా పోతుందని చెప్పారు.

  ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా

  ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా

  మానస వికాస నిపుణుడిగా తనకున్న అనుభవంతో టీవీ ఛానెల్స్ కు ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా ఇలాంటి టీవీ షోలను ప్రసారం చేయవద్దని సూచిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో ప్రేక్షకులు కూడా ఇటువంటి చెత్త ప్రోగ్రామ్ లను చూడకుండా ఉంటే రేటింగ్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

  వాళ్ల సీక్రెట్లన్నీ తెలుసు

  వాళ్ల సీక్రెట్లన్నీ తెలుసు

  ఈ కుటుంబ కలహాల షోలలో పాల్గొనే వారికి తాము తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఉండదని కేవలం పాపులారిటీ కోసం చేస్తుంటారని అన్నారు. ఆ టీవీ షోలలో తీర్పులిచ్చే వాళ్లు తమను మేథావులుగా భావించుకుంటారని విమర్శించారు. తీర్పులిచ్చేవాళ్ల సీక్రెట్లన్నీ తనకు తెలుసన్నారు.

  కుక్కను కూర్చోపెట్టినా

  కుక్కను కూర్చోపెట్టినా

  హైదరాబాద్ లో వారు సంప్రదించే సైకియాట్రిస్ట్ లందరూ తనకు ఫ్రెండ్సేనని చెప్పారు. టీవీ షోలలో తీర్పు ఇచ్చే స్థానంలో ఓ కుక్కను కూర్చోపెట్టినా అది తీర్పిచ్చేస్తూ ఉంటుందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ షో ల ఉద్దేశం ‘శవాల మీద డబ్బులు ఏరుకోవడమే' అంటూ మరింత ఘాటుగానే తన అభిప్రాయాన్ని చెప్పారు.

  English summary
  Ace novelist Yandamuri Veerendranath has yet again made controversial comments. However, this time, he focused on TV shows Like Rcchabanda Hosting By Roja
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X