twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు దర్శకులును హీరోలుగా పెట్టి

    By Srikanya
    |

    తెలుగులో దర్శకులను హీరోలుగా చేస్తూ తెలుగులో ఓ చిత్రం రూపొందనుంది.ప్రముఖ రచయిత యండమూరి వీరేంధ్రనాథ్‌ నవల 'అనైతికం' ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇక ఇలా దర్శకులను హీరోలుగా చేయటం తెలుగులో ఈ తరహా ప్రయత్నం ఇదే మొదటిసారని దర్శకుడు ప్రేమ్‌రాజ్‌ తెలిపారు. హీరో మొదలుకొని కనిపించే ప్రతీ పాత్రలో ఒక దర్శకుడు కనిపిస్తాడని ఆయన అన్నారు. ఇంకా ఈ చిత్రానికి పేరు నిర్ణయించలేదు.

    దర్శకుడు మాట్లాడుతూ ''మానవ సంబంధాల్లోని సంక్లిష్టతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఇది. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాల నేపథ్యంలో సాగుతుంద''న్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు, ఎన్‌.శంకర్‌, వి.ఎన్‌.ఆదిత్య, కాశీ విశ్వనాథ్‌, చంద్రమహేష్‌, సాగర్‌, రాంప్రసాద్‌, ఎం.ఎస్‌.నారాయణ, ఏవిఎస్‌, మద్దినేని రమేష్‌ మరికొందరు దర్శకులు నటిస్తున్నారు.

    'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్‌రాజ్‌ తన రెండో సినిమాను ప్రారంభించాడు. మొదటి సినిమాలో సమకాలీన రాజకీయాల్ని ఎంచుకున్న ఆయన, రెండో చిత్రంలో వైవాహిక బంధంలోని ఒడిదుడుకుల్ని కథాంశంగా తీసుకున్నారు. కీర్తన మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై టి.వెంకటేష్‌ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ : యండమూరి వీరేంద్రనాథ్‌, మాటలు : పరుచూరి బ్రదర్స్‌,దర్శకత్వం : ప్రేమ్‌రాజ్‌.

    English summary
    Yandamuri Veerendranath’s one of the most popular novels ‘Anaithikam’ will be made film. This film will be directed by Prem Raj, who directed Charmi’s Nagaram Nidrapothunna Vela movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X