Just In
- 7 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 7 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 8 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 9 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
KGF Chapter 2 Teaser నేషనల్, ఇంటర్నేషనల్ రికార్డ్స్.. రాకీ భాయ్‌ది వేరే లెవెల్!!
ఒక్కోసారి చెడు కూడా మంచికే జరుగుతుందని అంటుంటారు. యశ్ బర్త్ డే సందర్భంగా నేటి ఉదయం కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్ రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ నిన్న రాత్రే టీజర్ లీకైంది. ఏం చేయాలో తెలియని యూనిట్ హుటాహుటిన అధికారిక టీజర్‌ను రిలీజ్ చేసింది. నిన్న రాత్రి రిలీజ్ చేసిన టీజర్ 24 గంటలు తిరక్కముందే జాతీయ అంతర్జాతీయ రికార్డులను కొల్లగొట్టేసింది.

లీకువీరుల పని..
చాప్టర్ 2 సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. కేజీయఫ్ మొదటి పార్ట్ ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో దానికి మించి ఉండేలా మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. దానికి తగ్గట్టే ప్రమోషన్స్ జోరు కూడా పెంచేశారు. యశ్ బర్త్ డే సందర్భంగా ఇద్దామని చూసిన సర్ ప్రైజ్‌ను ముందే లీక్ చేశారు.

రాత్రంతా రచ్చ..
ఇక నిన్న రాత్రి చాప్టర్ 2 టీజర్ లీకైన విషయాన్ని చిత్రయూనిట్ త్వరగానే పసిగట్టింది. లీకైన టీజర్ అందరికీ చేరే లోపే ఒరిజినల్ టీజర్‌ను రిలీజ్ చేసి లీకు వీరులకు షాక్ ఇచ్చారు. దెబ్బకు ఒరిజినల్ వీడియో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. నిన్న రాత్రి నుంచి ఇంకా నెంబర్ వన్ స్థానంలోనే ట్రెండ్ అవుతోంది.

లైకుల్లో కొత్త రికార్డులు..
చాప్టర్ టీజర్ సోషల్ మీడియాలో కొత్త రికార్డులను లిఖిస్తోంది. లైకుల విషయంలో ఏకంగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే మూడు మిలియన్ల లైకులను కొల్లగొట్టేసింది. ఇంత తక్కువ సమయంలో అన్ని మిలియన్ల లైకులు కొట్టిన టీజర్ ఇంత వరకు రాలేదు.

వ్యూస్‌లో రచ్చ..
ఇక వ్యూస్ పరంగా చూస్తే చాప్టర్ 2 ఇండియన్ స్టార్ హీరోలెవ్వరూ కూడా పోటీ పడేలా లేరు. రాకీ భాయ్ దెబ్బకు మిగతా టీజర్లన్నీ కూడా వెలవెల బోయేలా ఉన్నాయి. 24 గంటలు గడవకముందే 70 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. ఇది ఇప్పటి వరకు ఎవ్వరూకొట్టని రికార్డ్.

టాప్ లిస్ట్‌లో..
బహు భాషల్లో రిలీజ్ అయిన చిత్రాల్లోనూ కేజీయఫ్ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సింగిల్ భాషలో ఒక్క చానెల్‌లో చూసిన టీజర్ వ్యూస్ లెక్కలు చూస్తే సాహోను హిందీలో 22.5 మిలియన్లు చూశారు. మొత్తంగా 44.5 మిలియన్లు చూశారు. మొత్తంగా ఇది 24 గంటల్లో 44 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొడితే చాప్టర్ 2 మాత్రం 21 గంటల్లోనే 70 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలబడింది.