»   » కన్నడ అర్జున్ రెడ్డి ఎవరో తెలుసా..?? ఆ లుక్‌తో సరిగ్గా సరిపోయాడు

కన్నడ అర్జున్ రెడ్డి ఎవరో తెలుసా..?? ఆ లుక్‌తో సరిగ్గా సరిపోయాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rocking Star Yash Playing A Role In Kannada Arjun Reddy

ఇప్పుడు టాలీవుడ్ చేస్తున్న జపం అర్జున్ రెడ్డి. టాలీవుడ్ సినిమాలోనే ఒక కుదుపు తెచ్చిన ఈ సినిమా ఇప్పుదు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు దక్షిణాదీ ఇటు ఉత్తరాది రెందు ఇండస్ట్రీలనూ ఒక ఊపు ఊపేస్తోంది ఒక చిన్న సినిమా 40 కోట్లను దాటించిందంటే మామూలు విషయం కాదు. ప్రస్తుత రోజుల్లో గంటన్నర సినిమాకే చిర్రెత్తిపోయే ప్రేక్షకులు కన్నార్పకుండా మూడుగంటల పాటు అర్జున్ రెడ్డి లవ్ స్టోరీని అలాగే తెరపై చూశారు.

తమిళ హక్కులను ధనుష్ కొనేసుకున్నాడు

తమిళ హక్కులను ధనుష్ కొనేసుకున్నాడు

ఈ సినిమాపై ఇప్పుడు పరభాషా నటులు కూడా మనస్సు పారేసుకుంటున్నారు. సినిమా వినూత్నంగా ఉందని తమిళ హక్కులను మొదట కొనేసుకున్నాడు హీరో ధనుష్. కానీ ఆ సినిమాలో తాను నటిస్తాననే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరో రన్ వీర్ సింగ్ స్పెషల్ వేసుకొని మరి సినిమా చూసి సినిమా తియ్యాలని ఫిక్స్ అయ్యాడు.

రాక్ లైన్ వెంకటేష్

రాక్ లైన్ వెంకటేష్

ఇప్పుడు అదే తరహాలో కన్నడలో కూడా అర్జున్ రెడ్డి హావా మొదలవ్వనుందని తెలుస్తోంది. కన్నడ హక్కులను ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ సొంతం చేసుకున్నారట.తెలుగులో రవితేజతో ‘పవర్' సినిమాను నిర్మించడంతో పాటు రజినీకాంత్ ‘లింగా'కు కూడా నిర్మాతగా వ్యవహరించిన రాక్ లైన్. ఈ మధ్య జోరు తగ్గించాడు. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.

కన్నడ యువ హీరో యష్

కన్నడ యువ హీరో యష్

ఇప్పుడతను అర్జున్ రెడ్డి హక్కులు తీసుకుని అర్జున్ రెడ్డి పాత్రకు కన్నడ యువ హీరో యష్ ని కూడా ఫిక్స్ చేసినట్లు టాక్. కన్నడలో ఈ యువ హీరో ఇలాంటి పాత్రలు చక్కగా చేస్తాడని మంచి గుర్తింపు ఉంది. యష్ కూడా దాదాపు విజయ్ దేరకొండ లాగే అర్జున్ రెడ్డి లుక్ కి పక్కాగా సరిపోతాడు

యువ దర్శకుడితో

యువ దర్శకుడితో

దీంతో నిర్మాత వెంకటేష్ ఒక యువ దర్శకుడితో కన్నడ అర్జున్ రెడ్డిని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నారట. మరి తెలుగులో భారీ విజయం అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా పరభాష ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. తమిళంలో రీమేక్ చేయడానికి ధనుష్ రైట్స్ తీసుకున్నాడు.

రణ్ వీర్ సింగ్

రణ్ వీర్ సింగ్

ఇక హిందీలో ఈ సినిమాను చేయడానికి రణ్ వీర్ సింగ్ ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయడానికి రాక్ లైన్ వెంకటేశ్ ఆసక్తిని చూపుతున్నాడు. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను అక్కడి యంగ్ హీరో 'యష్' తో చేయించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ తరహా పాత్రలు యష్ అయితే బాగా చేస్తాడనే ఉద్దేశంతో, ఆయననే ఫైనల్ చేశారనేది తాజా సమాచారం. ఇక కథానాయికగా ఎవరిని తీసుకుంటారో చూడాలి.

English summary
Sources say that Rockline Venkatesh is interested in casting Rocking Star Yash to play the role.. but nothing has been confirmed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu