»   » 9న వైఎస్ఆర్ యాత్ర ప్రారంభం.. టాలీవుడ్‌లో మరో బయోపిక్

9న వైఎస్ఆర్ యాత్ర ప్రారంభం.. టాలీవుడ్‌లో మరో బయోపిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాల నిర్మాణం ఊపందుకొన్నది. ఇప్పటికే ఎన్టీఆర్ జీవితం, పుల్లెల గోపిచంద్ లైఫ్ ఆధారంగా సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అదే జోష్‌లో టాలీవుడ్‌లో వైఎస్ఆర్ బయోపిక్ చిత్ర నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మా మూడో ప్రాజెక్ట్ ఇది అని నిర్మాతలు పేర్కొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రానికి యాత్ర టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహీ వీ రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్‌గా నటించనున్నారు.

Yatra The Movie on YSR life is going to start on 9th of April

కడప దాటి ప్రతీ గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడువాలనుంది. మీ గుండె చప్పుడు వినాలని ఉంది అనే వ్యాఖ్యలతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. యాత్ర షూటింగ్‌ను ఏప్రిల్ 9న ప్రారంభిస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది.

English summary
Yatra The Movie on YSR life is going to start on 9th of April. In this occassion, Film Unit has released Theme poster. They mentioned that He wanted to leave a footprint in History, Instead he left one in the Hearts of People Theme Poster of our 3rd & most PRESTIGIOUS project - YATRA
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X