»   » పవన్ వి టైమ్ పాస్ పాలిటిక్స్ అట... వైరల్ అవుతున్న రోజా సెటైర్లు

పవన్ వి టైమ్ పాస్ పాలిటిక్స్ అట... వైరల్ అవుతున్న రోజా సెటైర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెటైర్లు వేయటం లో ఎం.ఎల్.ఏ. రోజాది ఒక వింత స్టైల్ వెటకారం కలిపిన గొంతుతో డైరెక్ట్ గానే మనిషిని టార్గెట్ చేసేస్తారు. అందులో అన్యాపదేశంగా చెప్పటాలూ.., ఇండైరెక్ట్ వ్యవహారాలూ ఉండవు. పేరుతో పిలిచి మరీ విమర్శించేస్తూంతుంది. ఇదివరలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ని ఉద్దేషించి "పప్పు" అంతూ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలమయ్యాయి. అయితే గతకొన్ని నెలలుగా మీడియాకి దూరంగా ఉన్న రోజా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. జనం లోకి వస్తూ వస్తూనే రోజా ఈసారి తన దృష్టిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైపు మళ్ళించింది.

షూటింగ్ లేనపుడు మాత్రమే పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక హోదా గుర్తుకొస్తుందని.. దాని కోసం పోరాటం అంటూ బయటకు వస్తాడని రోజా విమర్శించింది. ఖాళీ సమయాల్లో పోరాటం చేసే వారు నాయకులు కాలేరని పవన్ ను ఉద్దేశించి రోజా పేర్కొంది. పవన్ కళ్యాణ్ కాకినాడ సభను ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తుందని కూడా పవన్ డబ్బుల కోసమే ఈ పనులన్నీ చేస్తున్నాడు అన్న రీతిలో పవన్ మీద విమర్శలు చేసేసింది.

రోజా మీదపవన్ సెటైర్ :

రోజా మీదపవన్ సెటైర్ :

మొన్న తిరుపతి సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజానుద్దేశించి పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనను రబ్బర్ సింగ్ అని రోజా అన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. నోరుజారితే సస్పెండయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుందంటూ రోజా మీద సెటైర్ వేశాడు పవన్. అయితే పవన్ మరీ డైరెక్ట్ గా పేరుపెట్టి అనలేదు. కానీ రోజాకి మాత్రం అంతసహనం లేనట్టుంది. మరీ పవన్ వల్ల ఇప్పుడు రాజకీయాలకు కొత్తగా ఒరిగేదేం లేదన్నట్టు డైరెక్ట్ గానే అనేసింది.

పవన్ భజన చేస్తాడు:

పవన్ భజన చేస్తాడు:

తాను ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని.. పవన్ కళ్యాణ్ లాగా "భజన" చేయనని చెప్పిన రోజా. అదికారంలో ఉన్న పార్టీ నుంచి ప్యాకేజీ తీసుకోలేదనే తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని.. ఈ విషయంలో తాను గర్వపడుతున్నానని రోజా పవన్ని గట్టిగాన్నే ఎదుర్కుంది. డబ్బులు తీసుకొనే టీడీపీకి ప్రచారం చేసిన మనిషి అన్న అర్థం వచ్చేలా... పవన్ ని తీవ్రంగా నే విమర్షించింది.

టైం పాస్ కే రాజకీయాలు:

టైం పాస్ కే రాజకీయాలు:

హైద‌రాబాద్‌లోని వైకాపా సెంట్ర‌ల్ ఆఫీస్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ టైంపాస్ కోస‌మే ప‌వ‌న్ పాలిటిక్స్‌లోకి వ‌చ్చిన‌ట్టుగా ఉంద‌ని.... ప‌వ‌న్‌కు సినిమా షూటింగ్ లేని స‌మ‌యాల్లో ప్ర‌త్యేక హోదా గుర్తుకు వ‌స్తుంద‌ని ఆమె ఎద్దేవా చేశారు. అసలు పవన్ కి రాజకీయాల పట్ల సీరియస్ నెస్ అనేదే లేదన్నుట్టుగా మాట్లాడిన ఈ మాట పవన్ కళ్యాన్ అభిమానులకి కోపం తెప్పించేదిగా ఉంది.

ఖాళీ ఎక్కువై పాలిటిక్స్ లోకి వచ్చాడు:

ఖాళీ ఎక్కువై పాలిటిక్స్ లోకి వచ్చాడు:

షూటింగ్ లేకపోవటం తో ఖాళీ ఎక్కువై పోయి పవన్ కళ్యాన్ రాజకీయాల్లోకి వచ్చాడనీ.... ఖాళీ సమయాల్లో ఉద్యమాలు చేసే వారు నాయకులు కాలేరని చుర‌క‌లంటించారు. కొన్ని పార్టీలు ఎప్పుడు పుడతాయో ఎప్పుడు మూతపడతాయో తెలియదని అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు. రోజా ప‌వ‌న్‌పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఎప్పటినుంచో:

ఎప్పటినుంచో:

వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం చాలా రోజులనుంచే జరుగుతోంది. ఇది ఇప్పుడు మొదలయ్యిందేం కాదు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పర్టీ సమయం నుంచీ పవన్, రోజా ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ చేసే మాటల యుద్దం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. గ‌త కొంత‌కాలంగా ప‌వ‌న్‌ను టార్గెట్ చేసిన రోజా ప‌వ‌న్ గ‌బ్బ‌ర్‌సింగ్ కాదు ర‌బ్బ‌ర్‌సింగ్ అని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.

సమాధానం ఇచ్చాడు:

సమాధానం ఇచ్చాడు:

ఈ సెటైర్ కి సమాధానం గానే మొన్న తిరుపతి సభలో పవన్ స్పందించాడు... అభిమానులు కూడా తనను రబ్బర్ సింగ్ అని రోజా అన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. "నోరుజారితే సస్పెండయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది" అంటూ రోజా మీద వేసిన సెటైర్ కి బాగానే కేరింతలు కొట్టారు. ఇప్పుడేమో రోజా మరోసారి పవన్ కి ఇంకో షాక్ ఇచ్చింది. దాంతో పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలను కూడా రెచ్చగొట్తినట్తయ్యింది.

పవన్ ఇంకా స్పందించలేదు:

పవన్ ఇంకా స్పందించలేదు:

ఇక ఈ సెటైర్లకి పవన్ అయితే స్పందించలేదు గానీ ఇటు పవన్ ఫ్యాన్స్, అటు రోజా ఫాలోవర్స్ మాత్రం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలని షేర్ చేస్తూ.... ఎవరి తరపునుంచి వాళ్ళు వాళ్ళ అభిమాన నాయకులని సపోర్ట్ చేస్తూ... వీళ్ళు గొడవలు పడుతున్నారు. రాబోయే కాకినడ జనసేన సభకోసం ప్రిపేర్ అవుతున్న పవర్ స్టార్ ఇప్పుడు రోజాకి సమాధానం కూడా ఆ వేదికనుంచే ఇస్తాడని భావిస్తున్నారు...

English summary
YCP MLA Roja Counter Attack on Pawan kalyan's settire in Tirupati janasena meeting
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu