»   » నాగచైతన్య కొత్త సినిమా రిలీజు డేట్ కన్ఫర్మ్

నాగచైతన్య కొత్త సినిమా రిలీజు డేట్ కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య హీరోగా గౌతంమీనన్ రూపొందిస్తున్న 'ఏమి మాయ చేసావో'...చిత్రం పిభ్రవరి ఇరవై ఆరవ తేదీన విడుదల కానుందని సమాచారం. ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే ప్రజాదారణ పొందుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై నాగార్జునకి చాలా ఆశలు ఉన్నాయి. ఆయన దీనిని గీతాంజలి తో పోలుస్తున్నారు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సోదరి మంజుల నిర్మిస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ సమర్పిస్తున్నారు. సినిమా పీల్డు నేపధ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. పూరీ జగన్నాధ్ ఈ చిత్రంలో డైరక్టర్ గా నిజ జీవిత పాత్రను పోషిస్తున్నారు. ఆయన వద్ద నాగచైతన్య అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తూంటాడు. ఇక ఇదే చిత్రాన్ని తమిళంలో త్రిష, ధనుష్ కాంబినేషన్ లో గౌతం మీనన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యకిది రెండవ చిత్రం. మొదటి చిత్రం జోష్ భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.అలాగే నాగార్జున కేడీ, ఆయన కుమారుడు నాగచైతన్య చిత్రమూ ఒకే నెలలో విడుదల అవటం విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu