»   » పాటలు స్లోగా ఉన్నాయని సినిమాను స్లోగా విడుదల చేస్తున్నారట!

పాటలు స్లోగా ఉన్నాయని సినిమాను స్లోగా విడుదల చేస్తున్నారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున 'కేడి", నాగచైతన్య 'ఏమాయ చేసావె" ఇంచుమించు ఒకే సమయంలో విడుదలవుతాయని సాగుతున్న ఊహాగానాలకి నాగార్జున బ్రేక్ వేశారు. ఏమాయ చేసావె" ఇప్పట్లో విడుదల కాదని తేల్చేశారు. యూత్ ఫుల్ ఫిలిం కావడంతో 'ఏమాయ చేసావె" ని ఎగ్జామ్స్, ఐపీఎల్ అయిన తర్వాత విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ఆ చిత్రం పాటలు కూడా స్లోగా ఉన్నాయని, మ్యూజిక్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతోందని, ఆ పాటలు బాగా పాపులర్ అవడానికి కూడా కాస్త సమయం అవసరమవుతుందని నాగార్జున అన్నారు. సో నాగచైతన్య ఏమాయ చేస్తాడో చూడాలంటే కనీసం మార్చి నెలాఖరు వరకు ఆగాల్సిందే. అందాకా నాగ్ చేసే జాదూ పనుల్తో ఫాన్స్ కి కాలక్షేపం ఎలాగో అయిపోతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu