twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణకు నీరాజనాలు పడతారు

    By Srikanya
    |

    రాముడు గెటప్‌లో బాలకృష్ణ, సీత పాత్రలో నయనతార ఇట్టే ఒదిగిపోయారు. ఇలాగే ఇతర పాత్రల్లో రోజా, శ్రీకాంత్, విందుధారాసింగ్ తదితరులు మెప్పిస్తారు. 80 ఏళ్ళ సినిమా చరిత్రలో ఈ సినిమా తప్పకుండా నిలిచిపోతుంది. ఎన్టీఆర్‌గారిని రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఆరాధించిన ప్రజలు త్వరలో బాలకృష్ణకు రాముడు పాత్రలో నీరాజనాలు పడతారనేది అక్షరసత్యం. రేపటి తరానికి ఈ చిత్రం ఆదర్శం కావాలనే సంకల్పంతో నిర్మించాం అంటున్నారు 'శ్రీరామరాజ్యం' నిర్మాత యలమంచిలి సాయిబాబు. రాముడుగా బాలకృష్ణ, సీతగా నయనతార నటించిన చిత్రం 'శ్రీరామరాజ్యం'. అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం రీరికార్డింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. రీరికార్డింగ్ ప్రారంభానికి ముందు ఇళయరాజాగారు సినిమా చూసి ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు అని బాపుగారిని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇళయరాజాగారు అందిస్తున్న రీరికార్డింగ్ సన్నివేశాలను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తున్నాయి. ప్రతిరోజు సీన్లు చూసి నోట్స్ రాసుకుని ఆర్కెస్ట్రాను పిలిచి నేపథ్య సంగీత పనులను చేస్తున్నారాయన. 70 లైవ్ ఇన్‌స్ట్రుమెంట్‌లతో ప్రతిరోజూ పని సాగిస్తున్నారు. రెగ్యులర్ పేటర్న్‌లో కాకుండా కొత్త తరహాలో నేపథ్యాన్ని అందివ్వాలని ఆయన శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు.

    English summary
    Actual cause of 'Sri Rama Rajyam' delay is the re-recording work of the flick. As the music director of the flick Ilayaraja was busy with the marriage ceremony and post-marriage functions of his son, Yuvan Shankar Raja, the flick's final background score is getting delayed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X