»   »  ఒకే పాటతో లవ్ స్టోరీ

ఒకే పాటతో లవ్ స్టోరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aithe
ఐతే, అనుకోకుండా ఒక రోజు సినిమాలతో ఢిఫెరెంట్ డైరక్టర్ గా యూత్ లో పేరుతెచ్చుకున్న దర్శకుడు యేలేటి చంద్ర శేఖర్. ఆయనిప్పుడో లవ్ స్టోరీతో ముందుకి రావటానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి వెన్నెల చిత్రానికి సంగీతం ఇచ్చిన మహేష్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. విశేషమేమిటంటే సినిమా మొత్తానికి ఒకే ఒక పాట ఉంటుందిట.సాధారణంగా ప్రేమ కథా చిత్రాలలో పాటలకు ప్రాముఖ్యత ఉంటుంది.ఈ సినిమా ద్వారా యేలేటి దాన్నిబ్రేక్ చేయటానికి ప్రయత్నిస్తున్నారన్నమాట.ఈ సినిమా షూటింగ్ లో ఎక్కువ భాగం స్వీడన్ లో జరుగుతుందిట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందిట. వెన్నెల చిత్రంలో పాటలకు మంచి పేరే వచ్చింది కాని కమర్షియల్ గా సినిమా వర్కవుట్ కాకాపోవటంతో ఆయనికి పెద్దగా అవకాశాలు రాలేదు. కాని నిజాయితీని నిరుపించుకునే వాళ్లకి కొద్దిగా లేటయినా అవకాశాలుకి లోటుండదు. ఎవరో ఒకరు గుర్తిస్తారనేది రుజువయినట్లైనంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X