»   »  మరోసారి దాసరి నారాయణరావు సంచలన కామెంట్స్

మరోసారి దాసరి నారాయణరావు సంచలన కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు ఏదైనా సినిమా ఫంక్షన్‌కు హాజరయ్యారంటే..... ఆయన నుండి ఈ రోజు ఎలాంటి సంచలన కామెంట్స్ వస్తాయో? అని ఎదురుచూస్తున్నారంతా. కొన్ని సార్లు ఆయన కామెంట్స్ వివాదాస్పదం అవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం.

గతంలో తెలుగు సినిమా పోకడలపై సెటైర్లు వేసిన ఆయన తాజాగా ‘ఎలుక మజాకా' సినిమా ఆడియో వేడుకలో మరోసారి సంచలన కామెంట్స్ చేసారు. ఈ మధ్య ఆడియో ఫంక్షన్లు జాతరలో డాన్స్ ఫ్రోగ్రాంలా మారాయని, ఆస్కార్ ఫంక్షన్లు చూసి మనవాళ్లు వాతలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. అయితే ‘ఎలుక మజాకా' వేడుక మాత్రం ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లా జరుగుతుంది అన్నారు.

సినిమా గురించి మాట్లాడుతూ...చాలా సంవత్సరాల తర్వాత రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న చిత్రం. ఎర్రబస్సు సినిమా సమయంలోనే నాకు కథ వినిపించాడు. నిజానికి తను ఈ చిత్రం చేయకూడదని అనుకున్నాడు. ఎందుకంటే ఇపుడు చిన్న సినిమాల పరిస్థితి బాగోలేదు. కథ విన్నతర్వాత సినిమా చేయమని చెప్పాను. ఇందులో ఎలుక ఒక ప్రధానమైన క్యారెక్టర్ పోషించింది. గొప్ప సెంటిమెంట్ ఉన్న చిత్రం. సత్య మంచి గ్రాఫిక్స్ అందించాడు. చిన్న సినిమాలకు గ్రాఫిక్స్ చేయడం చాలా కష్టం. చిన్న సినిమాలు పండుగలకు రిలీజ్ అయితే మంచిది. పెద్ద సినిమాలు ఎప్పుడైనా రిలీజ్ కావొచ్చు అన్నారు. వెన్నల కిషోర్ మంచి టైమింగ్ ఉన్న నటుడని కొనియాడారు.

ఈ ఆడియో వేడుకలో రాజేంద్రప్రసాద్, గిరిబాబు, రేగలంగి నరసింహారావు, వెన్నెల కిషోర్, సినీయర్ నరేష్, పావని, అన్నపూర్ణ, సునీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆడియో రిలీజ్

ఆడియో రిలీజ్


ఎలుకా మజాకా ఆడియో వేడుక దర్శకరత్న దాసరి నారాయణరావు చేతుల మీదుగా జరిగింది.

ఎలుక మెయిన్

ఎలుక మెయిన్


ఎలుకా మజాకా చిత్రంలో ఒక ఎలుక మెయిన్ రోల్ చేస్తుంది. ఎలుగా బ్రహ్మానందం నటించారు.

నటీనటులు

నటీనటులు


ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, పావని ముఖ్య పాత్రల్లో నటించారు.

నటీనటులు

నటీనటులు


ఈ చిత్రానికి మూల కథ: మురళీమోహన్ రావు, స్క్రీన్ ప్లే: దివాకర్ బాబు, మాటలు: గంగోత్రి విశ్వనాథ్, కెమెరా: నాగేంద్రబాబు, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: బల్లేపల్లి మోహన్, నిర్మాతలు: మారేపల్లి నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు, దర్శకత్వం: రేలంగి నరసింహారావు.

English summary
Check out Photos of Telugu Movie Yeluka Mazaka Audio Launch event held at Hyderabad.
Please Wait while comments are loading...