»   » శర్వానంద్ ‘ఏమిటో ఈ మాయ’విడుదల తేదీ ఖరారు

శర్వానంద్ ‘ఏమిటో ఈ మాయ’విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నిర్మిస్తున్న చిత్రం 'ఏమిటో ఈ మాయ'. ప్రముఖ తమిళ దర్శకుడు చేరన్ డైరక్ట్ చేసిన ఈ చిత్రానికి స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. వృత్తి, ఉద్యోగ జీవితం.. అంటూ నేటి యువత ఉరుకులు.. పరుగులు పెడుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు దూరంగా పరిగెడుతున్న వారు ఏం కోల్పోతున్నారో మా చిత్రంలో చూపిస్తున్నామంటున్నారు చేరన్‌.

నిర్మాత మాట్లాడుతూ ''పిల్లలపై తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు. తాము కన్న కలల్ని సాకారం చేయాలని ఆశిస్తుంటారు. అయితే ఈ విషయంలో యువత ఏం చేస్తోందనేదే ఈ చిత్ర ప్రధానాంశం. నేటి తరం ప్రేమ వ్యవహారాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు చేరన్‌. మనసుని హత్తుకునేలా భావోద్వేగాలుంటాయి. అంతే స్థాయిలో వినోదమూ ఉంటుంది. ఈ సినిమా యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకొంటుంది. శర్వానంద్‌, నిత్యమీనన్‌ల జంట అందరినీ అలరిస్తుంది. ఈ నెలలో పాటల్ని విడుదల చేస్తాము'' అన్నారు.

జాతీయ అవార్డ్‌ గ్రహీత చేరన్‌తో పనిచేయడం ఆనందాన్నిస్తోందని శర్వానంద్‌ అన్నారు. సిటీ నేపథ్యంలోని చక్కని కథాంశమిదని నిత్యామీనన్‌ తెలిపింది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ (జర్ని)చిత్రంతో హిట్‌కొట్టిన తెలుగు నటుడు శర్వానంద్‌ను చేరన్ తన చిత్రలో హీరోగా ఎంచుకోవటం తో చాలా ఆనందగా ఉన్నాడు. జర్ని తర్వాత ఆయన తెలుగులో అల్లరి నరేష్,శ్రియలతో చేసిన నువ్వా..నేనా చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఆయన సినిమా కమిటయ్యేటప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందులోనూ చేరన్ వంటి దర్శకుడు,నిత్యామీనన్ వంటి హీరోయిన్ అనేసరికి మరో మాట లేకుండా ఓకే చేసేసారు.

ఇక ఈ చిత్రం తెలుగు రైట్స్ కి మంచి డిమాండ్ ఉండే అవకాసం ఉంది. అప్పుడే కొందరు డబ్బింగ్ నిర్మాతలు ఈ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రం కావటంతో యువతకు బాగా పడుతుందని,చేరన్ కి తెలుగులో సైతం మంచి పేరు ఉండటంతో ఇక్కడా ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దానికి తోడు నిత్యామీనన్ ఉందంటే డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్డిబిటర్స్ ఆసక్తి చూపుతున్నారు. సినిమా ఎలా ఉన్నా ఓపినింగ్స్ కు లోటు ఉండదని,చిన్న సినిమాలకు ఓపినింగ్స్ బాగా మేలు చేస్తాయని చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్‌, పాటలు: అనంత శ్రీరామ్‌, సమర్పణ: కృష్ణ చైతన్య.

English summary
Yemito Ee Maya starring Sharwanand and Nitya Menon is all set to come to theatres on the 29th of November. This bilingual film is produced by Sravanthi Ravi Kishore under his home banner.
 Renowned Tamil director Cheran is making debut in Telugu with this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu