»   » ‘రంగస్థలం’ సాంగ్ దేవిశ్రీ అదరగొట్టాడు: నిజంగానే ఎంతో సక్కగా ఉంది...

‘రంగస్థలం’ సాంగ్ దేవిశ్రీ అదరగొట్టాడు: నిజంగానే ఎంతో సక్కగా ఉంది...

Posted By:
Subscribe to Filmibeat Telugu
‘రంగస్థలం’ సాంగ్ దేవిశ్రీ అదరగొట్టాడు: నిజంగానే ఎంతో సక్కగా ఉంది..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం'. సమంత హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈచిత్రానికి సంబంధించిన తొలి లిరికల్ సాంగ్ ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేశారు. హీరో చిట్టి బాబు (రామ్ చరణ్) తన ప్రేమించే లచ్చిమి(సమంత) అందాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది.

అద్భుతంగా ట్యూన్ కట్టిన దేవిశ్రీ

ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా... దేవిశ్రీ ప్రసాద్ వినసొంపైన ట్యూన్స్ సమకూర్చారు. పల్లెటూరి జానపదాలను గుర్తు చేస్తూ ప్రేక్షకుడిని ఒక మంచి రిలాక్సబుల్ మూడ్లోకి తీసుకెళ్లే విధంగా ఈ సాంగ్ ఉంది. ‘రంగస్థలం'లో ఈ సాంగ్ హైలెట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 జోరందుకోనున్న ప్రమోషన్లు

జోరందుకోనున్న ప్రమోషన్లు

రంగస్థలం చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు జోరందుకోనున్నాయి. ఇప్పటికే విడుదలైన హీరో, హీరోయిన్ లుక్, టీజర్, తాజాగా విడుదలైన సాంగుకు మంచి స్పందన వస్తోంది.

 వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్

వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్

చిత్ర బృందం నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'రంగస్థ‌లం' సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లో మార్చి 18న భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకకు హాజరవుతారని టాక్.

 రంగస్థలం

రంగస్థలం

రామ్‌ చ‌ర‌ణ్‌, స‌మంత‌, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆది పినిశెట్టి, అన‌సూయ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: ర‌త్న‌వేలు, ఎడిటింగ్‌: న‌వీన్ నూలి, సాహిత్యం: చ‌ంద్ర‌బోస్‌, ఫైట్స్‌: రామ్‌ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం), ద‌ర్శ‌క‌త్వం: సుకుమార్‌.

English summary
Listen Yentha Sakkagunnaave from Rangasthalam feat Ram Charan, Samantha. A Rockstar Devi sri Prasad Musical.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu