»   » నిజమే 'ఈగ 2'లో నటిస్తున్నా...మొదలెప్పుడంటే

నిజమే 'ఈగ 2'లో నటిస్తున్నా...మొదలెప్పుడంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ఈగ 2' తీయాలన్న ఆలోచన అయితే రాజమౌళి గారికి వచ్చింది. 'బాహుబలి 2' పూర్తయ్యాక ఆ సినిమా ఉండొచ్చు. అందులో నా పాత్ర ఏంటన్నది ఇప్పుడే తెలీదు అన్నారు హీరో నాని. 'ఈగ 2'లో నటిస్తున్నారా? అని నాని ని అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. ఆయన తాజా చిత్రం భలే భలే మొగాడువోయ్ ఈ రోజు (శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే ఆయన 'జై బాలయ్య' పేరుతో సినిమా చేస్తున్నరనే విషయం గురించి చెప్తూ... 14 రీల్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రంలో బాలకృష్ణగారి అభిమానిగా నటిస్తున్నా. చేతిపై 'జై బాలయ్య' అంటూ టాటూ ఉంటుంది. అది చూసి ఆ సినిమా పేరు అదే అనుకొన్నారు. కానీ అదేం కాదు. పేరేంటో త్వరలో ప్రకటిస్తాం అన్నారు.

Yes, I'm in Eega-2: Nani

తన కెరీర్ గురించి చెప్తూ....ఇది వరకు సినిమా తరవాత సినిమా చేద్దాం అనుకొనేవాణ్ని. ఓ కథ విని, స్క్రిప్టు పూర్తయి, సినిమాగా మారి అది బయటకు వచ్చాక, మరో రెండు నెలలు ఖాళీగా ఉండి, కొత్త కథలు విని.. అప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించేవాణ్ని. ఏడెనిమిది నెలలకు ఓ సినిమా వస్తే చాలనుకొనేవాణ్ని. కారణాలేమైనా 2013లో నా నుంచి ఒక్క సినిమా కూడా బయటకు రాలేదు.

2014లో వచ్చిన 'పైసా', 'జెండాపైకపి రాజు' సినిమాలు సరిగా ఆడకపోయేసరికి ఆ ప్రభావం చాలా పడింది. ఆడంది రెండే సినిమాలు. అయితే ఇరవై సినిమాలు ఫ్లాపయిన భారం పడింది. ఒక్క విషయం బాగా అర్థమైంది. 'నేను కావాలనుకొన్నప్పుడు బ్రేక్‌ తీసుకోవడం కాదు. పరిశ్రమ ఇచ్చినప్పుడే తీసుకోవాలి' అనిపించింది.

Yes, I'm in Eega-2: Nani

అదీగాక ఈ మధ్య అవుట్‌డోర్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఓ బామ్మ నాదగ్గరకు వచ్చింది. 'సినిమాలు చాలా నెమ్మదిగా చేస్తున్నావేంటి? స్పీడు పెంచు. లేదంటే కుదరదు' అన్నారు. నేను స్లోగా ఉంటే లాభం లేదని నాకప్పుడే అర్థమైంది. అలా బామ్మమాటే బంగారు బాట.. అనుకొన్నా అంటూ చెప్పుకొచ్చారు.

English summary
Nani confirm that he in Eega 2 and it will start after Baahubali-2.
Please Wait while comments are loading...