twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే మణిరత్నం,కొరటాల శివ,బోయపాటి కి 'నో' అన్నా: రామ్ చరణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ :మణిరత్నం కథ చెబితే 'నో' అన్నాను...నిజమే...అయితే కథ నచ్చకే సినిమా ఒప్పుకోలేదు. మణిరత్నం సినిమాలో నటించాలని, ఆయన ఫ్రేమ్‌లో కనిపించాలని అందరికీ ఉంటుంది. నేనూ చాలా ఆశపడ్డా. కానీ మా ఇద్దరికీ ఆ కథ నప్పదనిపించింది. భవిష్యత్తులో ఆయనతో తప్పకుండా పనిచేస్తా అన్నారు రామ్ చరణ్ తేజ. రీసెంట్ గా మణిరత్నం..చరణ్ ని కలిసి కథ చెప్పారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే ఇప్పుడు నాకు చెప్పిన అదే సబ్జెక్టుతో మోహన్‌లాల్‌గారి అబ్బాయితో చేస్తున్నారు. సినిమా చేసినందుకు పేరే కాదు, నిర్మాతకు డబ్బులు కూడా రావాలి. లేదంటే మణిరత్నం డైరెక్షన్‌లో సినిమా అంటే ఎవరు వద్దంటారు? అందరూ ఆయనతో కలిసి చేయాలని కోరుకుంటారు. అయితే పదిమందికీ డబ్బులు తెచ్చే సినిమా చేయాలనేది నా అభిప్రాయం. అలాంటి సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా అయ్యాక మేం కలిసి పనిచేస్తాం.

    'రచ్చ', 'నాయక్‌' అంటూ కమర్షియల్‌ సినిమాల్లో మెప్పించి, విజయాలు అందుకొన్న చరణ్‌.. తొలిసారి ఓ పూర్తిస్థాయి కుటుంబ కథలో కనిపించబోతున్నారు. అదే... 'గోవిందుడు అందరివాడేలే'.

    కృష్ణవంశీ శైలిలో చరణ్‌ ఎలా ఇమిడిపోయాడు? కుటుంబ కథలకు ఎంత వరకూ న్యాయం చేయగలడు అని జనం సందేహాలు పడుతూండగానే.. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. దసరా పండక్కి (అక్టోబరు 1న) 'గోవిందుడు..' పలకరించబోతున్నాడు.

    ఈ సందర్బంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. అవేమిటో చూద్దాం...

    స్లైడ్ షోలో...

    ఆ భయం లేదు

    ఆ భయం లేదు

    ఇది నా ఎనిమిదో సినిమా. అయితే ఎయిత్‌ ఫిల్మ్‌ ఫోబియా అనేదాని గురించి నాకు తెలీదు. నాకలాంటి సెంటిమెంట్స్‌ లేవు. ఆ సెంటిమెంట్‌ను ఈ సినిమా కచ్చితంగా బ్రేక్‌ చేస్తుంది. నేను సెంటిమెంట్స్ గురించి అస్సలు ఆలోచించను. మీరు అంటున్న సెంటిమెంట్‌ను గోవిందుడు అందరివాడేలే చిత్రంతో నేను బ్రేక్ చేసి విజయాన్ని సాధిస్తాననే విశ్వాసముంది.

    కథే ముఖ్యం ...డైరక్టర్ కాదు

    కథే ముఖ్యం ...డైరక్టర్ కాదు

    నాకు కథే ముఖ్యం. ఏ డైరెక్టర్‌ కథ నచ్చితే ఆ డైరెక్టర్‌తో చేస్తాను. కృష్ణవంశీ విషయానికొస్తే, ఆయన చేసిన సినిమాలు ఫెయిలయ్యాయేమో కానీ, డైరెక్టర్‌గా ఆయన ఫెయిలవలేదు. ‘పైసా' కానీ, ‘డేంజర్‌' కానీ.. ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్‌ ఫెయిలయ్యిందంతే. ఓ కథను నమ్ముకున్నప్పుడు రాజీపడకుండా తీసే వంశీ వంటి డైరెక్టరే నాకు కావాలి. నటీనటుల నుంచి నటనను రాబట్టే విషయంలో నెంబర్‌వన్‌ డైరెక్టర్‌ ఆయన. సినిమాలో నాకు బాగా నచ్చింది నా కేరక్టర్‌. దాన్ని తీర్చిదిద్దిన విధానం కానీ, నటునిగా నాలో కొత్త కొత్త కోణాలను కృష్ణవంశీ ఆవిష్కరించిన తీరు కానీ బాగా నచ్చాయి.

    రూటు మార్చా

    రూటు మార్చా

    నిజానికి ఓ పూర్తిస్థాయి కుటుంబ కథాచిత్రం చేయాలని 'మగధీర' తరవాతే అనుకొన్నా. మధ్యలో చాలామంది కథలు చెప్పారు. కానీ.. కృష్ణవంశీగారి స్క్రిప్ట్‌కి పూర్తిగా కనెక్ట్‌ అయిపోయాను. నటుడన్నాక ఏ తరహా కథైనా చేయగలగాలి. అందుకే ఈ ప్రయత్నం.

    లేదు...అలా చేయలేదాయన

    లేదు...అలా చేయలేదాయన

    షూటింగ్ లొకేషన్‌లో కృష్ణవంశీ అప్పటికప్పుడు సీన్‌లు మార్చేస్తారని చెబుతుంటారు. నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదు.
    సీన్‌లో బెటర్‌మెంట్ కోసం ఆయన ఒక్కోసారి మార్పుల్ని సూచిస్తారు. ప్రతి సీన్‌ను వివిధ కోణాల్లో పరిశీలిస్తారాయన. అంతేకాని కథను మార్చి కొత్త సన్నివేశాల్ని క్రియేట్ చేయరు.

    రాజ్ కిరణ్ ని అందుకే మార్చేసాం

    రాజ్ కిరణ్ ని అందుకే మార్చేసాం

    సినిమా మొదటి షెడ్యూల్‌ అయినప్పుడు నాన్నగారు, నేను రషెస్‌ చూశాం. సినిమాతో సరిగా కనెక్ట్‌ కాలేకపోయాం. రాజ్‌కిరణ్‌ ఎక్కడో మనకు కనెక్టవలేదు. ఆయన కూడా చాలా పెద్ద నటుడు. అందుకే ఆయన బదులు ప్రకాశ్‌రాజ్‌ అయితే బాగుంటుందని అనుకుని ఆయనను అప్రోచ్‌ అయ్యాం. రాజ్‌కిరణ్‌ బదులు ప్రకాశ్‌రాజ్‌ రావడం వల్ల ‘ఫీల్‌ ఆఫ్‌ ద ఫిల్మ్‌' పూర్తిగా మారిపోయింది. ప్రకాశ్‌ రావడం వల్ల ఇంకా ఎన్నో సీన్లు చెయ్యడానికి స్కోప్‌ వచ్చింది. కొత్త సీన్లు రాశాం. ఆయన కూడా చాలా ఇన్‌పుట్స్‌ ఇచ్చారు.

    రెండు కోట్లు ఎగస్ట్రా...

    రెండు కోట్లు ఎగస్ట్రా...

    నా సినిమాలన్నింటిలో ఏ రోజూ ఓవర్‌ బడ్జెట్‌ అవకుండా చివరిదాకా అనుకున్న బడ్జెట్‌లో తీసి, రిలీజ్‌ చేస్తున్న సినిమా ఇది. ఇవాళ 130 నుంచి 150 రోజులు తీస్తుంటే, మేం 95 రోజుల్లోనే దీన్ని పూర్తిచేశాం. ప్రకాశ్‌రాజ్‌ను పెట్టడం వల్ల కొన్ని సన్నివేశాలు రీషూట్‌ చేశాం. దానివల్ల గణేశ్‌కు రూ. రెండు కోట్లు అదనంగా అయి ఉండవచ్చు. అయితే ఆయన రావడం వల్ల సినిమాకు రూ. పది కోట్లు లాభమే కానీ, నష్టం లేదు.

    అవును వాళ్ల కథ ఓకే చేసా

    అవును వాళ్ల కథ ఓకే చేసా

    అవును. కోన వెంకట్,గోపీ మోహన్ చెప్పిన ఆ కథ బాగుంది. వచ్చే ఏడాది సినిమా చేస్తాను. దర్శకుడెవరో త్వరలో తెలియజేస్తాను.

    గౌతమ్ మీనన్ తో ఉంది..

    గౌతమ్ మీనన్ తో ఉంది..

    గౌతమ్‌ మీనన్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇద్దరికీ నచ్చిన సబ్జెక్ట్‌ దొరికితే వెంటనే చేస్తాం. అది తెలుగు, తమిళ భాషలు రెండింటిలోనూ ఉంటుంది. అలాగే మణిరత్నంగారితో చేసే సినిమా కూడా.

    సరిగ్గా ఖచ్చితంగా ఆడేది

    సరిగ్గా ఖచ్చితంగా ఆడేది

    అన్ని తరహా సినిమాలను చేయాలనేది నా కోరిక. ‘మగధీర' తర్వాత మంచి లవ్‌స్టోరీ చెయ్యాలని ‘ఆరెంజ్‌' చేశాను. అది సరిగా ఆడలేదు. అయినా నా ఫేవరేట్‌ సినిమాల్లో అదొకటి. సరిగా ట్రీట్‌ చేసినట్లయితే అది కూడా కచ్చితంగా మంచి సినిమా అయ్యేది. బాలీవుడ్‌లో వచ్చే ఏడాది చేద్దామనే ఆలోచనలో ఉన్నా. ‘జంజీర్‌' సరిగా ఆడలేదు. సమ్‌టైమ్స్‌ వియ్‌ మిస్‌ ద కేరక్టర్‌. ఆ పాత్రను నేను సరిగా అర్థం చేసుకోలేక పోయానేమో. దాని ఫెయిల్యూర్‌కు నేనెవర్నీ తప్పుపట్టను. అది చేసినందుకు నాకేమీ బాధలేదు.

    శ్రీను వైట్లతో చిత్రం గురించి...

    శ్రీను వైట్లతో చిత్రం గురించి...

    శ్రీను వైట్లతో చర్చలు నడుస్తున్నాయి. ఇంకా కమిట్‌ కాలేదు. అతను నాకు చెప్పింది, డెఫినెట్‌గా కొత్త తరహా కథ. తనకూ, నాకూ కూడా కొత్తే. నేను కథతోనే కమిట్‌ అవుతాను.

    కొరటాల శివ సినిమా గురించి...

    కొరటాల శివ సినిమా గురించి...

    కొరటాల శివ సినిమా విషయానికొస్తే నేను నిర్మాత నుంచి నయా పైసా అడ్వాన్స్‌ తీసుకోలేదు. నాకు ఆబ్లిగేషన్‌ ఉండకూడదు. డబ్బు తీసుకుంటే సినిమా చెయ్యాలనేది మన మైండ్‌లో ఉంటుంది. అప్పుడు ఆబ్లిగేషన్‌గా చెయ్యాలి. తీసుకోకపోతే అదేమీ ఉండదు. అప్పుడు కథ ఓకే కాకపోయినా మంచిరోజని చెప్పి బలవంతంగా పూజ చేయించాడు గణేశ్‌. కొరటాల చెప్పింది మంచి కథే. ఆ టైమ్‌లో నాకు ఫ్యామిలీ సినిమా చెయ్యాలని ఉంది. అందుకే అది చెయ్యలేదు. భవిష్యత్తులో కచ్చితంగా అతనితో సినిమా చేస్తా.

    బోయపాటి కూడా...

    బోయపాటి కూడా...

    బోయపాటి శ్రీను కూడా రెండు, మూడు కథలు చెప్పారు కానీ నాకు నచ్చలేదు. భవిష్యత్ లో మంచి కథ చెప్తే అతనితో చేస్తాను.

    నాన్న సాయం తీసుకుంటా

    నాన్న సాయం తీసుకుంటా

    డైరెక్టర్‌ కోరుకున్నప్పుడే నాన్న ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉంటుంది. డైరెక్టర్‌కు ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్‌ అవసరం లేదనుకున్నప్పుడు ఆయన కలగజేసుకోరు. స్టోరీ సెలక్షన్‌ అప్పుడు కచ్చితంగా ఆయన సాయం తీసుకుంటాను. ఇద్దరం కలిసే స్టోరీ ఫైనలైజ్‌ చేస్తాం. అయితే ఫైనల్‌ డెసిషన్‌ మాత్రం నాకే వదిలేస్తారు నాన్న.

    నా పాత్ర...

    నా పాత్ర...

    ఇందులో నేను లండన్‌లో పుట్టిపెరిగిన ఎన్.ఆర్.ఐ. యువకుడిగా కనిపిస్తాను. నా పాత్రపేరు అభిరామ్. అతనికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే ఎనలేని గౌరవముంటుంది. అతడు ఏ లక్ష్యం కోసం పల్లెలోకి అడుగుపెట్టాడన్నదే చిత్ర ఇతివృత్తం. హీరో వ్యక్తిత్వానికి అద్దంపట్టేలా ఆ టైటిల్‌ను పెట్టాం. ఈ వ్యక్తి అందరివాడు...అందరినీ కలుపుకుపోతాడు. ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం పాటుపడతాడు అనే విస్తృతార్థంలో ఈ టైటిల్‌ను పెట్టాం.

    సినిమా గురించి...

    సినిమా గురించి...

    ఇది ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా. చాలా రోజుల నుంచి ఫ్యామిలీ సినిమా చేద్దామని చూస్తున్నా. ‘మగధీర' తర్వాత నేను చేయాల్సిన సినిమా ఇది. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు చేయలేకపోయాం. అప్పట్నించీ కృష్ణవంశీ, నేను మాట్లాడుకుంటూనే ఉన్నాం. ‘ఎవడు' తర్వాత ఫ్యామిలీ సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాకు వంశీయే గుర్తుకువచ్చారు. మధ్యలో కొంతమంది దర్శకులు వచ్చి కథలు చెప్పారు. వంశీతప్ప మరే డైరెక్టరూ తమ కథలతో నన్ను కన్విన్స్‌ చెయ్యలేకపోయారు. చరణ్‌ని పెట్టుకొని కూడా మాస్‌ అప్పీల్‌ మిస్సవకుండా ఫ్యామిలీ సినిమా చేసి హిట్‌ కొట్టగలననే నమ్మకం దర్శకుడిలో ఉండాలి. వంశీలో ఆ నమ్మకం ఎక్కువగా కనిపించింది.

    English summary
    Ram Charan Said that he rejected Mani Ratnam's movie because of Story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X