twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నటి బేబీ నంద ఇక లేరు

    By Bojja Kumar
    |

    ప్రముఖ హిందీ నటి బేబీ నందా(75) ఇక లేరు. ఈ రోజు ఉదయం 9.15 గంటలకు ఆమె ముంబైలోని తన నివాసంలో కన్ను మూసారు. నంద జనవరి 8, 1939లో ముంబైలోని మరాఠి కుటుంబంలో జన్మించారు. నందా తండ్రి మాస్టర్ వినాయక్ కూడా నటుడే. తల్లి పేరు మీనాక్షి. 8 ఏళ్ల వయసులోనే నంద నటనా రంగంలోకి అడుగు పెట్టారు. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు.

     Yesteryear Actress Baby Nanda Passes Away!

    తొలి నాళ్లలో సిస్టర్ పాత్రల్లో ఆమె ఎక్కువగా నటించారు. భాభీ, ఛోటీ బహెన్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు ఆమె దాదాపు 70 చిత్రాల్లో నటించారు. నంద అంకుల్, దర్శకుడు అయిన వి.శాంతారామ్ దర్శకత్వంలో వచ్చిన 'తూఫాన్ ఔర్ దియా'(1956) చిత్రం నంద కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది.

    నంద మొదటి నుండి భయస్తురాలు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదని అంటుండే వారు. ఎవరితోనూ ఎలాంటి రిలేషన్ షిప్ పెట్టుకోవడానికైనా ఆమె ఇష్టపడే వారు కాదట. మహ్మద్ దేశాయ్‌తో నంద ఎఫైర్ ఎంగేజ్మెంట్ వరకు వెళ్లింది. జూన్ 18, 1992లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. దురదృష్ట వశాత్తు ఆయన కొన్నిరోజులకే మరణించారు.

    English summary
    Veteran film actress Baby Nanda is no more. She breathed her last at about 9.15 am today (March 25). Nanda was born on January 8, 1939, to a Marathi-speaking family in Bombay. Nanda's father was actor Master Vinayak, and her mother was Meenaxi. She came into acting at the age of 8 as her father passed away early in life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X