twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘1000 అబద్ధాలు’లో అలనాటి హీరోయిన్స్ స్పెషల్

    By Srikanya
    |

    హైదరాబాద్ : దర్శకుడు తేజ తాజా చిత్రం'1000 అబద్ధాలు'. ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించటంలో తనదైన శైలితో ఆకట్టుకొనే తేజ తాజాగా ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాటని చిత్రీకరించబోతున్నాడు. 1950 నుంచీ 1980 మధ్యకాలంలో హీరోయిన్స్ ల చిత్రాల్లోని అందమైన పాటల క్లిప్పింగ్‌లను ఈ స్పెషల్ సాంగ్‌లో పొందుపరచనున్నాడు.

    'వందేళ్ల భారతీయ సినిమా'లో తెలుగు తేజం ఏ విధంగా వెలుగొందిందీ రేపటి తరానికి ఈ పాట రూపేణా తెలియజెప్పనున్నాడు. ఆనాటి సుప్రసిద్ధ నటీమణులు అంజలీదేవి, కాంచన, విజయనిర్మల, సరోజాదేవి, జమున, భారతి తదితరుల భావస్ఫూరిత చిత్ర మాలికలను ఈ పాటలో నిక్షిప్తం చేయనున్నారు. నాలుగైదు నిమిషాల పాటు ఉండే ఈ పాట ఏప్రిల్ 22 నుండి 25 వరకూ చిత్రీకరణ జరుపుకుంటోంది.

    దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ అవార్డులను తరచూ ప్రముఖ నటుల కోసం మాత్రమే కేటాయించటం వల్ల ఎందరో నటీమణులను జ్ఞాపకం చేసుకొనే అవకాశం తెర మరుగవుతోంది. ఈ నేపథ్యంలో అలనాటి నటీమణులను 'తెర' మీదికి తెచ్చే విధంగా ఈ పాట రూపొందుతున్నట్టు తేజ పేర్కొన్నారు. ఈ పాటలో సాయిరాం శంకర్, ఎస్తేర్ తదితరలు కూడా కనిపిస్తారు.

    తేజ మాట్లాడుతూ- ''పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి '1000 అబద్ధాలు' అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం'' అని చెప్పారు.

    ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: రమణగోగుల, కెమెరా: రసూల్ ఎల్లోర్, కళ: నరసింహవర్మ, ఎడిటింగ్: శంకర్, పాటలు: అరిశెట్టి సాయి, పోతుల రవికిరణ్. సమర్పణ: చిత్రం మూవీస్, నిర్మాణం: శ్రీప్రొడక్షన్స్.

    English summary
    Teja's ‘1000 Abaddalu’ is in news for most of the time. Yesterday there was news that the film will have former AP Governor ND.Tiwari episode and now buzz is yesteryear hero-ines Anjali Devi, Kanchana, Jamuna, Vijaya Nirmala, Saroja Devi, Bharathi and others will be featuring in a special song. Teja speaking about the song said normally heroes are given awards like Dadasaheb Phalke award but there is no such award for great stars and he planned to honour them in such manner. He said he is happy to direct them in the song which will be starting soon. Sai Ram Shankar and Esther will be featuring in the song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X