»   » సమంత 'ఎటో వెళ్లిపోయింది మనసు'విడుదల తేదీ

సమంత 'ఎటో వెళ్లిపోయింది మనసు'విడుదల తేదీ

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: నాని,సమంత కాంబినేషన్ లో గౌతమ్ మీనన్ రూపొందించిన చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదల చేయటానికి నిర్ణయించారు. చిత్రం గురించి నాని మాట్లాడుతూ...ఆ ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలోపడ్డారు. కానీ ఐ లవ్‌ యూ మాత్రం చెప్పుకోలేదు. కారణం... అందుకు తగిన సమయం దొరకలేదు. మరి ఆ మనసుల్లో ఉన్న ప్రేమ ఎప్పుడు ఎలా బయటపడిందో తెరపైనే చూడాలి అన్నారు.'ఎటో వెళ్లిపోయింది మనసు'చిత్రానికి సి.కల్యాణ్‌ నిర్మాత.


  నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ ''సున్నితమైన భావోద్వేగాలతో సాగే ప్రేమకథ ఇది. ప్రణయగాథల్లో కొత్తకోణాన్ని ఆవిష్కరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. తెరపై కనిపించే ప్రతి సన్నివేశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. నాని, సమంత మధ్య వచ్చే సన్నివేశాలు యువతరాన్ని అలరిస్తాయి. ఇళయరాజా సమకూర్చిన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది''అన్నారు.నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి.


  తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో హీరోగా నాని నటిస్తుండగా... తమిళ, హిందీ వెర్షన్లలో హీరోలుగా జీవా, ఆదిత్యరాయ్ కపూర్ నటిస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ సమంతానే కథానాయిక కావడం విశేషం. అంటే... ఈ సినిమా ద్వారా సమంత బాలీవుడ్‌కి పరిచయం కానున్నారన్నమాట. ఈ ప్రేమ కథకు ఇళయరాజా సంగీతాన్ని అందించడం మరో విశేషం. ఈ సినిమాతో సమంత, గౌతమ్ మీనన్‌లు మరోసారి యువతను 'మాయ'లో పడేయడం ఖాయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.


  దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ఉన్నట్టుండి ఆ కుర్రాడి మనసు దారి తప్పి ఎటో వెళ్లిపోయింది. ఒంటరైన ఆ కుర్రాడు తన తోడు కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఇంతలో ఎదురుపడిన ఓ యువతిని... నా మనసు జాడ నీకైనా తెలుసా? నీ వైపే వచ్చినట్లుంది అంటూ ఆరా తీశాడు. మరి ఆ చిన్నదాని సమాధానమేమిటో తెరపైనే చూడాలంటున్నారు ‌. నిర్మాత మాట్లాడుతూ ''మూడు దశల్లో తారసపడ్డ ఓ యువ జంట కథ ఇది. వారి మధ్య ప్రేమ అనేది ఏ క్షణంలో పుట్టిందో తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకొనేలా సాగుతుంది. ఇళయరాజా బాణీలు చిత్రానికి బలాన్నిస్తాయి''అన్నారు.

  English summary
  
 Gautam Menon's 'Yeto Vellipoyindi Manasu', a bi - lingual flick, letting out no update about its release, the audio launch being happened long ago. The film gets a release date on this December 14th... 'Maestro' Ilayaraja's music for the film is already declared to be a success... Samantha - Nani's hit pair is also creating a buzz, considering their look together in the trailers of the film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more