»   » రామ్ చరణ్ ‘మగధీర’...అది రాజమౌళి ‘మగధీర’ కాదు

రామ్ చరణ్ ‘మగధీర’...అది రాజమౌళి ‘మగధీర’ కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలోనే కదా రామ్ చరణ్ ‘మగధీర' సినిమా వచ్చింది. అది రామ్ చరణ్ సినిమా అంటూనే రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర కాదంటారేంటి? అనుకుంటున్నారా! అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే.

అప్పట్లో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘మగధీర' చిత్రాన్ని తమిళంలో ‘మావీరన్' అనే టైటిల్‌తో విడుదల చేసారు. తర్వాత రామ్ చరణ్ హీరోగా ‘ఎవడు' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. తాజాగా ‘ఎవడు' చిత్రాన్ని తమిళంలో ‘మగధీర' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. అదన్నమాట సంగతి.

Yevadu dubbed into Tamil as Magadheera

భద్రకాళి ఫిలింస్‌ పతాకంపై భద్రకాళి ప్రసాద్‌ ‘మగధీర'(తెలుగులో ‘ఎవడు') అనువాద కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. అడ్డాల వెంకట్రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా విడుదల కానుంది. పోస్టర్లు చూస్తే ఇది ఆ ‘మగధీర' కాదని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాతలు అంటున్నారు. పైగా అల్లుఅర్జున్‌ కూడా పోస్టర్లలో కనిపించడం వల్ల మరింత క్లారిటీ ఉంటుందని అంటున్నారు.

English summary
Mega Power star Ram Charan's Yevadu dubbed into Tamil as Magadheera.
Please Wait while comments are loading...