twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ‘ఎవడు’ కొత్త రికార్డు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'ఎవడు' చిత్రం విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ...ఓ విషయంలో మాత్రం కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంకా విడుదల కానప్పటికీ హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్మడు పోయినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం రూ. 3.60 కోట్లు హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడయినట్లు టాక్.

    చిరంజీవికి సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు ఇంత భారీమొత్తం వెచ్చించి థర్డ్ పార్టీగా కొనుగోలు చేసాడని, దీన్ని ఆయన హిందీ ఎంటర్టెన్మెంట్ చానల్స్‌కు మరింత భారీ రేటుకు అమ్మాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    గతంలో రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 3.5 కోట్లకు అమ్ముడయ్యాయి. తాజాగా 'ఎవడు' చిత్రం ద్వారా తన రికార్డు తానే బద్దలు కొట్టాడు చెర్రీ. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఈ సినిమా సమైక్య ఉద్యమం కారణంగా వాయిదా పడింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

    'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. జయసుధ, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్బీ శ్రీరామ్‌, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సహ నిర్మాతలు: శిరీష్‌ - లక్ష్మణ్‌, నిర్మాత : దిల్ రాజు, దర్శకత్వం : వంశీ పైడిపల్లి.

    English summary
    Mega Power Star Ram Charan’s Yevadu had been facing several shift in release dates, but 'Yevadu' hindi version had been sold at whooping 3.5 Crores. This is the highest price paid for any Telugu cinema dubbed into Hindi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X