twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ సూపర్ : 4 సినిమాలు 40 కోట్లు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ అద్భుతంగా సాగుతోందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 'చిరుత' చిత్రంతో తెరంగ్రేటం చేసిన రామ్ చరణ్....తెరంగ్రేటంతోనే సత్తా ఉన్న హీరోగా, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. కెరీర్లో ఇప్పటి వరకు 7 చిత్రాల్లో నటించిన చరణ్ 'మగధీర'తో ఇండస్ట్రీ ఇచ్చారు.

    రామ్ చరణ్ నటించిన 7 సినిమాల్లో 4 సినిమాలు 40 కోట్లు అంతకంటే ఎక్కువ షేర్ సాధించాయి. ఇలాంటి ఘన సాధించిన ఏకైక హీరోగా చెర్రీ చరిత్ర సృష్టించాడు. చరణ్ కెరీర్లో ఆరెంజ్, తుఫాన్ చిత్రాలు మాత్రమే ప్లాప అయ్యాయి. మిగతా చిత్రాలు చిరుత, మగధీర, రచ్చ, నాయక్, ఎవడు చిత్రాలు విజయం సాధించాయి.

    తాజాగా విడులైన 'ఎవడు' చిత్రం తాజాగా 40 కోట్ల షేర్ క్రాస్ అయింది. నైజాం ఏరియాలో 10 కోట్ల షేర్ దాటేసింది. సీడెడ్‌లో 7 కోట్లు, ఉత్తరాంధ్రలో 4 కోట్లు షేర్ సాధించింది. ఈస్ట్, వెస్ట్, నెల్లూరు, కర్ణాటక ఏరియాల్లో కూడా 'ఎవడు' చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

    రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'ఎవడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబడుతోంది.

    English summary
    Ram Charan's Yevadu is crossing 40 crore share now. This film has already crossed 10 crore share in Nizam. It’s nearing 7 crores in Ceded and 4 crores in Utharandhra. This film has created first week records in few centers and territories like East, West, Nellore and Karnataka as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X