»   » ఎవడు: బిగ్గెస్ట్ హిట్ అంటూ దిల్ రాజు సంబరం (ఫోటోలు)

ఎవడు: బిగ్గెస్ట్ హిట్ అంటూ దిల్ రాజు సంబరం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: విడుదల ఆలస్యం అయినప్పటికీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన 'ఎవడు' చిత్రం శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దిల్ రాజు ఇప్పటి వరకు దాదాపు 16 చిత్రాలు నిర్మించారు. అందులో బొమ్మరిల్లు, దిల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.

  ఇటీవల ఏర్పాటు చేసిన 'ఎవడు' మూవీ సక్సెస్ మీట్లో దిల్ రాజు మాట్లాడుతూ....'ఎవడు సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. విడుదల లేటవుతుందని కొన్ని సార్లు నిరాశ పడ్డాను. కానీ విడుదలైన తర్వాత బాక్సాఫీసు వద్ద ఫలితాలను మమ్మలి ఎంతో ఆనంద పరుస్తున్నాయి. మా బేనర్లో ఇప్పటి వరకు తీసిన 16 సినిమాల కంటే ఈచిత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

  జనవరి 12వ తేదీ విడుదలైన 'ఎవడు' చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో తొలి రోజు రూ. 9.03 కోట్ల నెట్ సాధించినట్లు తెలుస్తోంది. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ముందు నుండీ ఉంది. కానీ ఈ రేంజిలో ఓపెన్సింగ్ సాధిస్తుంది అనుకోలేదు. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలుఅ ని దిల్ రాజు అన్నారు.

  ఎవడు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, అమీ జాక్సన్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. అల్లు అర్జున్, కాజల్ ఈచిత్రంలో అతిథి పాత్రల్లో నటించారు. ఎవడు సక్సెస్ మీట్‍‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

  ఎవడు సక్సెస్ మీట్ -1

  ఎవడు సక్సెస్ మీట్ -1

  ఈ మధ్య కాలంలో ఏ పెద్ద హీరో సినిమానూ ఇన్ని వాయిదాలుపడుతూ..లేటవుతూ...నెగిటివ్ టాక్ తెచ్చుకుంటూ రిలీజ్ కాలేదు. అయితే విషయం ఉంటే ఎన్ని అడ్డంకులు ఎలా వచ్చినా విజయం ఆ సినిమా వెంటే ఉంటుంది.

  ఎవడు సక్సెస్ మీట్-2

  ఎవడు సక్సెస్ మీట్-2

  Face/Off (1997) నుంచి కేవలం ఫేస్ లు మార్చటం అనే పాయింట్ ని మాత్రమే తీసుకుని అల్లిన ఈ కథ పూర్తిగా రొటీన్,తెలుగు పగ ప్రతీకారం మార్క్ తో నింపారు. ఇంకా చెప్పాలంటే ఒక హీరో ప్లేసులోకి మరో హీరో వచ్చే... ద్విపాత్రాభినయం(ఇద్దరు హీరోలు...ఇద్దరికీ పగతో నిండి ఉన్న కథలు..ఇద్దరు విలన్స్...ఇద్దరు హీరోయిన్స్... ) తరహా కధనే. అయితే పాయింట్ నావల్టీది కాబట్టి కొత్తగా అనిపిస్తుంది.

  ఎవడు సక్సెస్ మీట్-3

  ఎవడు సక్సెస్ మీట్-3

  కానీ కథన పరంగా సినిమా మొత్తం రెండు కథలుగా (ఫస్టాఫ్...అల్లు అర్జున్ కథ...అతని పగ తీరడం.., సెకండాఫ్ రామ్ చరణ్ కథ...అతని పగ తీరడం) అంటూ విడి విడిగా ఉండటమే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ అయ్యాక...స్క్రీన్ టైమ్ మొత్తం రామ్ చరణ్ ఎవడు అని తెలుసుకోవటం అనే ఫ్లాష్ బ్యాక్ కే కేటాయించారు.

  ఎవడు సక్సెస్ మీట్-4

  ఎవడు సక్సెస్ మీట్-4

  అలా కాకుండా...దాని లెంగ్త్ తగ్గించి...ఆ ప్లాష్ బ్యాక్ అయ్యాక..ఏం జరిగింది అనే దానిపై ఎక్కువ దృష్టి పెడితే మరింత బాగుండేది. ఇద్దరు హీరోలు ఒకే బాడీలో ఇమిడినట్లు రెండు కథలు ఒకదానికొకటి మరింతగా కలిస్తే ఇంకా హైలెట్ గా ఉండేది.

  ఎవడు సక్సెస్ మీట్-5

  ఎవడు సక్సెస్ మీట్-5

  హీరోకి అర్దమైన ఫేస్ ఆఫ్ ట్విస్ట్ ....విలన్స్ కూడా అర్దమయ్యి...వాళ్లు అప్పుడేం చేసారు అన్నదే ఎప్పుడూ కథ. ఆ విషయం ఎందుకనో ఈ కథనంలో మిస్సైంది. విలన్స్ కన్ఫూజన్ లో ఉండగానే సినిమా పూర్తై పోయింది. విలన్స్ కు అసలేం జరిగిందో తెలుసి..అప్పుడు వారు ఏం స్టెప్ వేసారు అన్నది ఉంటే మరింత బాగుండేది. ఫస్టాఫ్ లోనూ విలన్ రాహుల్ దేవ్ కి...అసలు తనని ఎటాక్ చేస్తున్నది ఎవరో అర్దం కాకుండానే చచ్చిపోతాడు..సెకండాఫ్ లోనూ విలన్ సాయికుమార్ పరిస్ధితీ అదే. ఇద్దరికీ తమ మీద దాడి చేస్తున్నది ఎవడో తెలుసుంటే ఎలా ఉండేదో మరి..

  ఎవడు సక్సెస్ మీట్-6

  ఎవడు సక్సెస్ మీట్-6

  సినిమా హైలెట్ లలో రామ్ చరణ్ ఒకరు. ఫస్టాఫ్ లో వేరే వారి మైండ్ ని పెట్టుకున్న రామ్ చరణ్ ..పగ తీర్చుకునే సీన్స్ బాగా వచ్చాయి..అలాగే ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ..ఓ నాయకుడుగా ఎదిగే క్రమం...ఆ ఎమోషన్స్ బాగున్నాయి.

  ఎవడు సక్సెస్ మీట్-7

  ఎవడు సక్సెస్ మీట్-7

  ఉన్నది కొద్ది సేపే అయినా అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. తనది కాని కథని అల్లు అర్జున్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఒప్పుకోవటం చాలా గొప్ప విషయం. ఆ విషయంలో అతనికి హాట్యాఫ్ చెప్పాలి.

  ఎవడు సక్సెస్ మీట్-8

  ఎవడు సక్సెస్ మీట్-8

  ఈ కథలో హీరోయిన్స్ కు పెద్ద ప్రయారిటీ లేదన్నది నిజం. శృతిహాసన్ కేవలం డాన్స్ లకే పరిమితమైంది. కాజల్ ఉన్నది కొద్ది క్షణాలే. అమీ జాక్సన్ ఓకే.

  ఎవడు సక్సెస్ మీట్-9

  ఎవడు సక్సెస్ మీట్-9

  సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ లో బ్రహ్మానందం ని హైలెట్ చేసారు ...కానీ సినిమాలో అంత సీన్ లేదు..మరి కొంత ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచితే ఈ రివేంజ్ డ్రామా మరింత రక్తి కట్టేది.

  ఎవడు సక్సెస్ మీట్-10

  ఎవడు సక్సెస్ మీట్-10

  ఆడియో అంత పెద్ద కాలేదు కానీ సినిమాలో వాటి చిత్రీకరణ బాగుంది. ముఖ్యంగా ప్రీడమ్ సాంగ్ బాగా వచ్చింది. చరణ్ డాన్స్ లు కూడా పాటలకు ప్రాణం పోసాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది

  ఎవడు సక్సెస్ మీట్-11

  ఎవడు సక్సెస్ మీట్-11

  విలన్స్ గా చేసిన రాహుల్ దేవ్, సాయి కుమార్...పరమ రొటీన్ గా చేసారు. ఉన్నంతలో కోటానే తన మార్క్ చూపించే ప్రయత్నం చేసారు. నెల్లూర్ స్లాంగ్ లో బాగా రక్తి కట్టించే ప్రయత్నం చేసారు. అజయ్, సుబ్బరాజు వంటి వారు ఉన్నా పెద్దగా వారికి స్కోప్ లేదు.

  ఎవడు సక్సెస్ మీట్-12

  ఎవడు సక్సెస్ మీట్-12

  దర్శకుడుగా వంశీ ఎప్పటిలాగే మాస్ ఎలిమెంట్స్ తో బాగానే చేసాడనిపించుకున్నాడు. ఫస్టాఫ్ స్పీడుగా రన్ తో పరుగెట్టినా..సెకండాఫ్ కి వచ్చేసరికి...ఆ కిక్ లేదు. జయసుధ చేత చెప్పించే.. నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు అంటూ ఉంటారు. కానీ పోతూ
  పోతూ ఒక మగాడ్ని ఇచ్చాడు వంటి డైలాగ్స్ తో మాస్ ని అరిపించాడు.

  English summary
  Producer Dil Raju, who is ecstatic with the response to his Telugu action-thriller Yevadu, said that the film has turned out to be the biggest hit of his banner despite having a delayed release. So far, the producer has produced 16 films including hits like Bommarillu, Dil and Seethamma Vakitlo Sirimalle Chettu, under his banner Sri Venkateswara Creations.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more