»   » 'ఎవడు' మలయాళ వెర్షన్ టైటిల్..విడుదల తేదీ

'ఎవడు' మలయాళ వెర్షన్ టైటిల్..విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. మళయాళ వెర్షన్ కు గానూ...భయ్యా అనే టైటిల్ పెట్టారు. మై బ్రదర్ అనేది ట్యాగ్లైన్. కె.మంజు అనే నిర్మాత ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. మొదట ఈ చిత్రం జనవరి 24 న విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడది జనవరి 31 కి వాయిదా వేసారు. పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే వల్ల పనులు లేటు అవుతున్నాయని చెప్తున్నారు. ఇక 'కథలో సత్తాఉంటే విజయం మన వెంటే ఉంటుందని మరోసారి రుజువైందని' ఈ చిత్రం నిర్మాత దిల్‌రాజు అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ సంవత్సరంన్నర పాటు శ్రమించి ఎవడు చిత్రీకరించామని 6 నెలల పాటు కొన్ని కారణాల వలన విడుదల చేయలేకపోయామన్నారు. చిత్రం విడుదల ఆలస్యం కావటంతో అనేక వదంతులు వచ్చాయని, వేటినీ తాము లెక్కచేయలేదని, కథాబలం ఉండటం వలనే ప్రేక్షకులు చిత్రానికి విజయం అందిచారన్నారు.

Yevadu Malayalam version postponed

ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన సాయికుమార్‌ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం 'పోలీస్‌' చిత్రంలో ఎంతో మంచి పాత్రచేశానని, ఇంత కాలానికి 'ఎవడు' చిత్రంతో మరో మంచి పాత్ర లభించిందని తెలిపారు. మరో నటుడు ఎల్‌బి.శ్రీరాం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తాను సినిమాలపై మమకారంతో వెళ్లి చాలాకాలం అవకాశాలకోసం ఎదురు చూశానని, ఎవడు చిత్రంలో తనకు మంచి పాత్ర ఇవ్వటం తన అదృష్టంగా భావిస్తున్నాన్నారు. 'సై' ఫేం శశాంక్‌ మాట్లాడుతూ ఎవడు చిత్రంతో తిరిగి తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు.

చిత్ర దర్శకులు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ 3 సంవత్సరాలపాటు నిద్రకు దూరమయ్యానని, ఇంత కష్టానికి ప్రేక్షకులు అందించిన తీయని విజయం సంతోషాన్నిస్తోందన్నారు. తెలుగు ప్రజలున్నంత కాలం తెలుగు చిత్రసీమ పదిలంగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణ మరువరానిదని కృతజ్ఞతలు తెలిపారు. కథాపరంగా రామ్‌చరణ్‌తోపాటు మరో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ కేవలం కథను నమ్మి ఈ సినిమాలో నటించటం ఎప్పటికీ మరచిపోలేనన్నారు.

English summary
The Malayalam version of Ram Charan’s Yevadu planned to release the film on 24th Janauary but now it has changed to 31st January. K Manju has bagged the Malayalam dubbing rights of this flick. This film is titled as ‘Bhayya’ in Malayalam version with a tag line ‘My Brother’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu