»   » షాకింగ్ : ‘ఎవడు’ మూవీ సెన్సార్ రిపోర్ట్

షాకింగ్ : ‘ఎవడు’ మూవీ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం ఈ నెల 31న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అభిమానులు, ఫ్యామిలీ ప్రేక్షకులు షాకయ్యే విధంగా ఈచిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యులు 'A' సర్టిఫికెట్ జారీ చేసారు. పెద్దలు మాత్రమే చూడదగిన సినిమాకు మాత్రమే 'A' సర్టిఫికెట్ జారీ చేస్తారు. దీన్ని బట్టి సినిమాలో వయోలెన్స్, రొమాన్స్ పాళ్లు ఎక్కువగానే ఉన్నాయని స్పష్టం అవుతోంది.

Yevadu movie

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు.

'ఎవడు' మూవీ విడుదలకు వారం రోజుల గ్యాప్‌తో పవర్ స్టార్ నటించిన 'అత్తారింటికి దారేది' మూవీ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఎఫెక్టు పడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...అత్తారింటికి దారేది సినిమా వల్ల ఎవడు సినిమాకు ఎలాంటి సమస్య రాదని భావిస్తున్నాం. ఇప్పటికే అనేక కమర్షియల్ హిట్స్ ఇచ్చిన రామ్ చరణ్ ఎవడు చిత్రంతో మరో విజయం సొంతం చేసుకుంటారు' అనే నమ్మకం వ్యక్తం చేసారు.

'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. జయసుధ, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్బీ శ్రీరామ్‌, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సహ నిర్మాతలు: శిరీష్‌ - లక్ష్మణ్‌, నిర్మాత : దిల్ రాజు, దర్శకత్వం : వంశీ పైడిపల్లి.

English summary
Mega Power Star Ram’s upcoming movie ‘Yevadu’ has completed its censor formalities and it has received an A certificate from the censor board. Vamshi Paidipally is the director of this movie and Dil Raju is the producer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu