»   » థియేటర్లో రామ్ చరణ్ హంగామా, ఫ్యాన్స్‌కి సెల్యూట్ (ఫోటోలు)

థియేటర్లో రామ్ చరణ్ హంగామా, ఫ్యాన్స్‌కి సెల్యూట్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శుక్రవారం సాయంత్రం సంధ్యా థియేటర్ వద్ద హంగామా సృష్టించారు. ఆయన నటించిన తాజా సినిమా 'ఎవడు' చిత్రం ఈ నెల 12న విడుదలవుతున్న నేపథ్యంలో ఆ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్ ట్రైలర్ విడుదల చేసారు.

రామ్ చరణ్ రాకను పురస్కరించుకుని థియేటర్ వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసారు. బ్యాండ్ భాజాలతో అభిమానులు హంగామా సృష్టించారు. రామ్ చరణ్ ప్లెక్సీలకు పాలాభిషేకం చేసారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రామ్ చరణ్ రాగానే విజిల్స్, కేరింతలతో తమ మనసులోని ఆనందాన్ని వెలుబుచ్చారు.

స్లైడ్ షోలో.....రామ్ మాట్లాడిన వివరాలు, ఫోటోలు

రామ్ చరణ్ మాట్లాడుతూ...

రామ్ చరణ్ మాట్లాడుతూ...


అభిమానుల కోరిక మేరకు ఎవడు సినిమాలోని ఓ డైలాగు కూడా చెప్పారు. తాను సినిమా ప్రమోషన్‌ కోసం రాలేదని, తనకు సినిమాను ప్రమోట్ చేయడం రాదని, అభిమానుల మధ్య గడపడానికి మాత్రమే వచ్చానని చెర్రీ అన్నారు.

అభిమానులే సర్వస్వం

అభిమానులే సర్వస్వం


సంక్రాంతి బహుమతిగా ఎవడు సినిమా వస్తోందని ఆయన అన్నారు. సినిమా విడుదల సమయంలో జాగ్ర్తత్తగా అభిమానులు ఆనందాన్ని ప్రదర్శించాలని, అభిమానులకు ఏమైనా అయితే సినిమా విజయం సాధించినా తమకు ఆ ఆనందం ఉండదని ఆయన అన్నారు.

అందరి సినిమాలు ఆడాలి

అందరి సినిమాలు ఆడాలి


సంక్రాంతికి విడుదలయ్యే తన ఎవడు సినిమాతో పాటు మిగతా హీరోల సినిమాలు కూడా విజయవంతం కావాలని రామచరణ్ తేజ్ ఆశించాడు. సంక్రాంతికి విడుదలవుతున్న మహేష్ బాబు 1 నేనొక్కడిని ఉద్దేశించే చెర్రీ ఆ మాటలు అన్నాడని భావిస్తున్నారు.

చరన్ డైలాగ్

చరన్ డైలాగ్


డైలాగ్ చెప్పడం ఇక్కడ రాదని, అయితే తనకు సభకు వచ్చి డైలాగులు చెప్పకూడదనే పట్టింపులు తనకు లేవని, తడితే చెప్తానని, లేకుంటే చెప్పనని, మీ కోరికకు మించింది ఏదీ లేదు అంటూ ఆయన ఓ వాక్యం డైలాగు చెప్పేశారు.

వంశీ పైడిపల్లి డ్రైవ్ చేస్తూ...

వంశీ పైడిపల్లి డ్రైవ్ చేస్తూ...


రామ్ చరణ్ వస్తున్న కారును దర్శకుడు వంశీ పైడిపల్లి స్వయంగా డ్రైవ్ చేసారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

అభిమానులు, మీడియా

అభిమానులు, మీడియా


రామ్ చరణ్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మీడియా వారు ఈ సందడిని కవర్ చేసేందుకు పోటీ పడ్డారు.

అభివాదం

అభివాదం


థియేటర్లోకి వచ్చిన వెంటనే అభిమానులకు అభివాదం చేస్తున్న రామ్ చరణ్.

ట్రైలర్

ట్రైలర్


ఎవడు థియేట్ర్రికల్ ట్రైలర్ విడుదలైన అనంతరం అభిమానులతో కలిసి వీక్షిస్తున్న రామ్ చరణ్.

అభిమానులను ఉద్దేశించి..

అభిమానులను ఉద్దేశించి..


అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూన్న రామ్ చరణ్. అభిమానుల కోరిక మేరకు ఎవడు సినిమాలోని ఓ డైలాగు కూడా చెప్పారు. తాను సినిమా ప్రమోషన్‌ కోసం రాలేదని, తనకు సినిమాను ప్రమోట్ చేయడం రాదని, అభిమానుల మధ్య గడపడానికి మాత్రమే వచ్చానని చెర్రీ అన్నారు.

ఫ్యాన్స్‌కి సెల్యూట్

ఫ్యాన్స్‌కి సెల్యూట్


సభ ముగిసిన అనంతరం తనపై ఇంతగా అభిమానం చూపిస్తున్న అభిమానులకు సెల్యూట్ చేస్తున్న రామ్ చరణ్ తేజ్.

రామ్ చరణ్ జిందాబాద్

రామ్ చరణ్ జిందాబాద్


రామ్ చరణ్‌పై తమ అభిమానాన్ని చాటు కుంటూ పూలమాలలు వేసి జిందాబాదులు కొడుతున్న అభిమానులు.

అభిమానులకు సూచనలు ఇస్తున్న వంశీ పైడిపల్లి

అభిమానులకు సూచనలు ఇస్తున్న వంశీ పైడిపల్లి


రామ్ చరణ్ రాగానే అభిమానులు....జోష్ మరింత పెంచారు. దీంతో కాస్త సైలెంటుగా ఉండండయ్యా అంటూ సూచిస్తున్న వంశీ పైడిపల్లి.

English summary
Yevadu Movie Theatrical Trailer Launch at Sandhya 70mm, Hyderabad. Actor Ram Charan Teja, Director Vamsi Paidipally, Producer Dil Raju graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu