'ఎవడు' రిలీజ్ వాయిదా...కొత్త డేట్ ఖరారు
హైదరాబాద్ : రూమర్స్ నిజమయ్యాయి. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 31 న విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆగస్టు 21 కి మారే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ సాయింత్రం ఈ విషయాన్ని నిర్మాతలు ఖరారు చేసారు. చిరంజీవి పుట్టిన రోజు కి ఓ రోజు ముందున విడుదల అవుతుంది.
ముందుగా ఈ చిత్రాన్ని ఈ నెల 31కి విడుదల చేద్దామనుకున్నారు, అయితే ప్రత్యేక తెలంగాణా నేపధ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ ఆగష్టు 2న తమ నిర్ణయం తెలిపే ఆస్కారం వున్న కారణాన ఆ తేదిలలో గొడవల జరిగే అవకాశం వుంది కనుక ఈ సినిమాను సేఫ్ డేట్ కు వాయిదా వేసారని తెలుస్తోంది. శృతిహాసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. అల్లు అర్జున్ మరియు కాజల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
దిల్ రాజు మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. చరణ్ నటన, నృత్యాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు''అన్నారు.

చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్, రాహుల్‌దేవ్, అజయ్, ఎల్.బి.శ్రీరాం, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, కళ: ఆనంద్ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్


Click it and Unblock the Notifications











