»   » యోగా చెయ్యటం అంటే టార్చర్ ఛాంబర్ లో ఉండటమే...త్రిష

యోగా చెయ్యటం అంటే టార్చర్ ఛాంబర్ లో ఉండటమే...త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

యోగా క్లాస్ మానేసాను. అదే టార్చర్ ఛాంబర్ కి మానేసాను...నో పెయిన్...నో వెయిట్ లాస్...అంటూ నిట్టూరుస్తూ ట్వీట్ చేసింది త్రిష. ఆమె గత కొద్ది రోజులుగా పవర్ యోగా క్లాసులకు వెళ్తోంది. ఆ మధ్య నా అంతట నేనుగా తీసుకున్న డెసిషన్‌ పవర్‌ యోగా. అది మొదలు పెట్టిన తర్వాత నా శరీరాకృతిలో చాలా మార్పు వచ్చింది. ఈ మధ్య నన్ను చూసిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు అని అడిగితే 'పవర్‌ యోగా ఈజ్‌ ది సీక్రెట్‌ ఆఫ్‌ ఫిట్‌ నెస్‌" అని చెబుతున్నాను అంటూ తన ఫిట్‌ నెస్‌ గురించి బోల్డు కబుర్లు చెప్పింది. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమో గానీ ఇలా నెగిటివ్ పబ్లిసిటీ ప్రారంభించింది. త్రిష ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ 'లవ్ లీ" చిత్రంలో హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నటుడు గణేష్‌ బాబు నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu