»   » చీర కట్టుకున్నావు.. నీవు ముస్లిం కాదు పో.. సైఫ్ ఖాన్ సోదరికి చేదు అనుభవం..

చీర కట్టుకున్నావు.. నీవు ముస్లిం కాదు పో.. సైఫ్ ఖాన్ సోదరికి చేదు అనుభవం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాంప్రదాయ పద్ధతిలో చీరకట్టు మహిళలకు అందాన్నే కాకుండా.. హుందాతనాన్ని తెచ్చిపెడుతుంది. చీరను ధరించడం అనేది కులం, మతం, ప్రాంతానికి సంబంధం లేని విషయం. ఇది గ్రహించలేని కొందరు నెటిజన్లు పండుగ రోజు చీరలో కనిపించిన బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్‌పై ఆక్రోషాన్ని వెళ్లగక్కారు. నీవు మతానికి సంబంధించిన వ్యక్తివి కాదుపో అని దుర్భాషలాడటం సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. శ్రీమంతం జరిగిన నాటి ఫొటోను పోస్ట్ చేసిన సోహాకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. గతంలో దంగల్ చిత్రంలో నటించిన సనా ఫాతీమా షేక్ బికినీ ధరించడం కూడా వివాదాస్పదం చేశారు కొందరు.

సైఫ్ అలీఖాన్ చెల్లెలు..

సైఫ్ అలీఖాన్ చెల్లెలు..

ఒకప్పటి ఇండియన్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, అలనాటి అందాల తార షర్మిలా టాగోర్ కూతురు సోహా అలీఖాన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు సోదరి, కరీనా కపూర్‌కు మరదలు. ఇటీవల కునాల్ కేమూ అనే నటుడ్ని 20015లో జనవరిలో సోహా పెళ్లి చేసుకొన్నది. ప్రస్తుతం ఆమె గర్భవతి కూడా.

రంజాన్ రోజు చీరలో దర్శనం

రంజాన్ రోజు చీరలో దర్శనం

అయితే తాజాగా రంజాన్ పండుగ రోజు బెంగాలీ ట్రెడిషన్‌లో చీర కట్టుకొని తన భర్త కునాల్‌తో దిగిన ఫొటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పింక్ కలర్ శారీలో చాలా సంప్రదాయంగా కనిపించింది. అంత వరకు బాగానే ఉంది. ఆ ఫోటో గురించి నెటిజన్లు అభ్యంతరకరమైన కామెంట్లు పోస్ట్ చేశారు.

ఒట్టు నీవు ముస్లిం కాదు..

ఒట్టు నీవు ముస్లిం కాదు..

చీరకట్టులో నాకు నీవు నచ్చలేదు. ఫొటోలో చీర కట్టు సరికాదు. మా మతానికి వ్యతిరేకం. ఒట్టు నీవు ముస్లిం కాదు. నీకు నేను రంజాన్ శుభాకాంక్షలు కూడా చెప్పను అని ఓ వ్యక్తి తీవ్రమైన కామెంట్లు చేశాడు.

నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం..

నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం..

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపడానికి సిగ్గుపడుతున్నది. నీవు ముస్లిం కాదు. నిన్ను చూసి మేము సిగ్గుపడుతున్నాం అని మరోకరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు.

సోహాకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్

సోహాకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్

ఇలాంటి కామెంట్ల మధ్య కొందరు అభిమానులు సోహా అలీఖాన్‌కు మద్దతుగా నిలిచారు. అభ్యంతరకరమైన కామెంట్లు చేయడంపై తీవ్ర నిరసన తెలిపారు. చీరకట్టుకోవడాన్ని కూడా మతాన్ని ఆపాదించడం సరికాదని అన్నారు. మాతృత్వాన్ని అనుభవించబోతున్న సోహాకు కొందరు అభినందనలు తెలిపారు.

English summary
Soha Ali Khan, who is expecting her first baby with actor husband Kunal Kemmu, was subjected to a few hateful comments for sharing a picture of herself in a sari on Instagram. The 38-year-old actor posted the photo on Tuesday from what many are guessing is a traditional Bengali baby shower. Soha wore a pink silk sari with flowers in her hair and posed with Kunal who wore a white kurta pyjama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu