twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతగా నారా రోహిత్, టైటిల్ ఏమిటంటే...??

    By Srikanya
    |

    Nara Rohit
    హైదరాబాద్ :యువ హీరోలు నిర్మాణ రంగంవైపు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాతగా తమ పేరు తెరపై చూసుకోవాలను కొంటున్నారు. శర్వానంద్‌, నాని నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. విష్ణు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పేరుతో సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో చేరడానికి నారా రోహిత్‌ కూడా ఉత్సాహం చూపిస్తున్నాడు. త్వరలోనే ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నట్టు సమాచారమ్‌. ఈ చిత్రం టైటిల్ మారియో అని చెప్తున్నారు.

    నారా రోహిత్ నిర్మించే చిత్రంలో నటీనటులంతా కొత్తవారే ఉంటారని తెలుస్తోంది. దర్శకుడికీ ఇదే తొలి సినిమా అని తెలిసింది. ప్రేమ ఇష్క్ కాదల్, సెకండ్ హ్యాండ్ ఫేమ్ విష్ణు ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. మారియో అనేది ఓ గేమ్. అలాగే ఓ షాప్ పేరు. ఓ గేమ్ షాప్ లో జరిగే కథ అని తెలుస్తోంది. ప్రస్తుతం నారా రోహిత్‌ 'ప్రతినిధి', 'శంకర', 'మద్రాసి' సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు పడవల ప్రయాణం ఎంత వరకూ సాగుతుందో చూడాలని ఇండస్ట్రీలో జనం అంటున్నారు. ఇక నారా రోహిత్ మాత్రం చాలా ఉత్సాహంగా నిర్మాణం వైపు ప్రయాణం పెట్టుకున్నాడు.

    ప్రముఖ నిర్మాత,మరియు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఓ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారంటే మిగతా ఏరియాలు బిజెనెస్ చాలా స్పీడుగా అయిపోతుంది. తాజాగా ఆయన నారారోహిత్ 'ప్రతినిధి' చిత్రం నైజాం,వైజాగ్ రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ రెండవ వారంలో విడుదల కు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఉంది. వర్తమాన రాజకీయాల్ని ప్రశ్నించే ప్రజా 'ప్రతినిధి'గా నారా రోహిత్ ప్రేక్షకులముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి జె.సాంబశివరావు నిర్మాత. ఈ చిత్రం ఓ కిడ్నాప్ కథ చుట్టూ జరగనుంది. మొన్న ఆడియో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది.

    నారా రోహిత్ మాట్లాడుతూ..ఈరోజుల్లో రూపాయికే విలువ లేదు. ఇక పైసల్ని పట్టించుకొనేదెవరు? కానీ అతను అలా కాదు. ప్రతి పైసాకీ సమాధానం చెప్పాల్సిందే. ఎనభై నాలుగు పైసల కోసం ఏకంగా.. ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేశాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన కాళ్ల దగ్గరకు రప్పించాడు. ఇంతకీ అతనెవరు? ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన సమస్యలపై ఓ సామాన్యుడు సాగించిన సమరం ఇది. ప్రతినిధిగా నారా రోహిత్‌ నటన, ఆయన పలికే సంభాషణలు అందరికీ నచ్చుతాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రచార చిత్రం కూడా ఆకట్టుకొంటోంద''న్నారు. ''ప్రస్తుత రాజకీయాలు సగటు మనిషి జీవితాన్ని ఎలా మారుస్తున్నాయో ఈ చిత్రంద్వారా చూపిస్తున్నాం''అని నిర్మాత చెప్పారు.

    ఇక '18 సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18 సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరూ అడగరే...వస్తున్నా...అడగడానికే వస్తున్నా..' అని నారా రోహిత్ ట్రైలర్స్ లో అంటున్నారు. సమకాలీన రాజకీయాంశాల్ని చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ప్రజా శ్రేయస్సును కాంక్షించే సిసలైన ప్రజా ప్రతినిధి ఎలా వుండాలో సినిమాలో చూపిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి . సంగీతం: సాయికార్తీక్‌.

    English summary
    Now another young hero is making preparations to turn a producer. He is none other than Nara Rohit. Nara Rohit debuted onscreen with the movie Banam and scored a hit with Solo. Now he has become a busy hero with four projects in his hands. On the other hand he has also focused his attention on film making and soon he will be producing a movie titled ‘Mario’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X