»   » నిర్మాత కూతురుతో లేచి పోయిన ‘భలే మంచి రోజు’ డైరెక్టర్

నిర్మాత కూతురుతో లేచి పోయిన ‘భలే మంచి రోజు’ డైరెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్: సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'భలే మంచి రోజు' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీరామ్ ఆదిత్య తాజాగా తన ప్రేమ వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల విడుదలైన తన సినిమాలో మాదిరిగానే తన ప్రేయసితో లేచిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  ఎవరో అమ్మాయితో లేచిపోతే ఇంత పెద్ద వార్త కాక పోవచ్చు కానీ....టాలీవుడ్‌కి చెందిన ఓ నిర్మాత కూతురుతో ఆదిత్య లేచిపోవడం హాట్ టాపిక్ అయింది. ఓ ఆంగ్లపత్రికలో వచ్చిన కథనం ప్రకారం ఆ అమ్మాయికి ఆల్రెడీ ఈ నెల 17న పెళ్లి కూడా ఫిక్స్ అయింది. అమ్మయి తండ్రి, నిర్మాత తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా ఐదురోజుల వేడుక చేసేందుకు ఏర్పాటు కూడా చేసుకున్నాడు. అంతలోనే ఇంట్లో నుండి పెళ్లి కూతురు ఎస్కేప్.!


  Young Director sriram aditya Eloped With Producer's Daughter

  అయితే ఈ విషయమై నిర్మాత పోలీసులకు ఎలాంటి కంప్లైంట్ చేయలేదని తెలుస్తోంది. ఆ అమ్మాయి మేజర్ కావడం, శ్రీరామ్ ఆదిత్యతో కొంత కాలంగా ప్రేమలో ఉండటంతో......పోలీస్ స్టేషన్ కి ఎక్కి రచ్చ చేసుకోవడం ఎందుకనే ఉద్దేశ్యంతో సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. 


  ఈ జంట ఎక్కడ ఉన్నారు అనేది తెలియడం లేదు. మీడియాలో శ్రీరామ్ ఆదిత్య ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. తన సినిమాలో మాదిరిగానే శ్రీరామ్ ఆదిత్య తన ప్రేమ కోసం తెగింపుగా ముందుకు దూకాడని అంటున్నారు.


  ఎక్కడికి పారిపోలేదు...


  దర్శకుడి స్నేహితులు మాత్రం ఆయన ఎక్కడికి లేచి పోలేదని, పారి పోలేదని..... చాలా కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని అంటున్నారు. శ్రీరామ్ ఆదిత్యకు సన్నిహితుడు, భలేమంచి రోజు మూవీలో నటించిన ఓ నటుడు చెప్పిన వివరాల ప్రకారం పెద్దలకు ఇష్టం లేక పోవడంతో బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారని తెలిపారు. పరిస్థితుల కారణంగానే సైలెంటుగా ఉన్నారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. శ్రీరామ్ ఆదిత్య తన తర్వాతి సినిమాలపై దృష్టి పెట్టాడు. దర్శకులు, నిర్మాతలతో టచ్ లో ఉంటున్నాడని తెలిపారు.

  English summary
  Sriram Adittya, who shot to fame with his début film Bhale Manchi Roju starring Sudheer Babu, is now making headlines with his love life. According to the reports pouring in, the young director eloped with a popular producer's daughter, whose marriage is fixed to happen on 17th April.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more