»   » 60 ఏళ్ల వృద్ధుడుగా మారిన హీరో రామ్ ..

60 ఏళ్ల వృద్ధుడుగా మారిన హీరో రామ్ ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రామ్..త్వరలో 60 ఏళ్ల వృద్ధుడుగా కనిపించనున్నాడు. ఇది ఓ ప్రయోగంగా, తనకు బాగా నచ్చినట్లుగా ఆయన తన బ్లాగ్ లో రాసుకున్నారు. లక్ష్యం వాసు దర్శకత్వంలో రూపొందుతున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' లో ఈ విచిత్రం కనపడనుంది. అయితే ఆ గెటప్ తెరపై అది కొద్ది సేపే ఉంటుందని చెప్తున్నారు. ఇక ఈ కొత్త గెటప్ గురించి రామ్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన రామ్ ను ఎంతో థ్రిల్లింగ్ కు గురిచేసిందని...అంటూ..ఈ విషయాన్ని రామ్ తన బ్లాగ్ లో చెప్పుకొచ్చారు. వృద్ధుడి గెటప్ తో రాజమండ్రి వీధుల్లో రామ్ పెరేడే చేసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనను గుర్తుపట్టలేక పోయారని రాసుకున్నాడు..అలాగే ఈ చిత్రంలో రామ్ తొలిసారి పోలీస్ పాత్రను కూడా పోషిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల 70 రోజుల పాటు రాజమండ్రిలో చుట్టప్రక్కల గ్రామాల్లో షూటింగ్ జరుపుకొంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. కొంత భాగం పల్లెలోనూ సెకెండాఫ్ ముంబయిలోనూ ఈ చిత్ర కథనం సాగుతుంది. ఇక సంగత దర్శకుడు ఎంఎం కీరవాణికి ఇది 200వ చిత్రం కావటం మరో విశేషం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu