»   » 'కోడిపుంజు' లా మారుతున్న యంగ్ హీరో

'కోడిపుంజు' లా మారుతున్న యంగ్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

"నచ్చావులే" చిత్రంతో హీరోగా పరిచయమైన తనీష్ త్వరలో "కోడిపుంజు" గా మారనున్నాడు. ప్రస్తుతం అందాల రాముడు దర్శకుడు దీప్తి దర్శకత్వంలో మంచి వాడుగా మారుతున్న తనీష్ ఈ కొత్త చిత్రం లైఫ్ ఇస్తుందని భావిస్తున్నాడు. ఇక ఈ కోడిపుంజు చిత్రం డిసెంబర్ 1న ప్రారంభం కానుంది. దమ్మున్నోడు చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన బీవీవీ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు. 'కోడిపుంజు' అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రోజా తనీష్ తల్లి పాత్రలో కనిపించనుంది. ఆమె శంభో శివ శంభో, గోలీమార్ చిత్రాల ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ పరిచయం కానుంది. ఈ చిత్రాన్ని సాయి కృష్ణ ప్రొడక్షన్స్ పతాకం పై డీ.ఎస్.రావు నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu