»   » మళ్ళీ మాస్ బాట పట్టిన యంగ్ రెబల్ స్టార్ ‘ప్రభాస్’

మళ్ళీ మాస్ బాట పట్టిన యంగ్ రెబల్ స్టార్ ‘ప్రభాస్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చి, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాల ద్వారా కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రభాస్... మళ్లీ మాస్ బాట పట్టారు. ఆయన కథానాయకుడిగా 'రెబల్" పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. 'మాస్, డాన్" వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియ పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె భగవాన్, జె పుల్లారావు నిర్మిస్తున్న భారీ చిత్రం 'రెబల్" రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. 'ప్రభాస్ మాస్ ఇమేజ్‌ని అనూహ్యంగా పెంచే సినిమా ఇది. ఈ చిత్రం విషయంలో ప్రభాస్ అందిస్తున్న సహకారం మరచిపోలేం. అనుష్క, దీక్షాసేథ్ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే..

ఇది ప్రభాస్ కెరీర్‌లోనే హై బడ్జెట్ ఫిలిం. టైటిల్‌కి తగ్గట్టుగా శక్తివంతమైన కథాంశంతో రూపొందుతోంది. లారెన్స్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా హిట్ చేయాలన్న తలంపుతో అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం నిర్మాతలుగా మాకు గర్వంగా ఉంది. ఈ చిత్రం కోసం 13 రోజుల పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముంబై విలన్స్ ఆకాష్, విశాల్ కౌలిక్ లతో పాటు ఫైటర్స్ పాల్గొనగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సారధ్యంలో హాలీవుడ్ చిత్రాల స్ధాయిలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించారు. ఇది ఈ చిత్రంలో ఓ హై లైట్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్, బ్రహ్మానందం లపై కొన్ని కామెడీ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ వారంలోనే ప్రభాస్ అనుష్కలపై ఓ పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేసారు.

English summary
Young rebel star who is riding high on darling and MR Perfect success in acting in a movie called Rebel in the direction of Raghava lawrence under the Sri Balaji Cine Media banner produced by J Bhagwan and J Pulla Rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X