»   » యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్-లక్ష్మీప్రణతీల ఘనంగా నిశ్చితార్థ వేడుక!

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్-లక్ష్మీప్రణతీల ఘనంగా నిశ్చితార్థ వేడుక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజానికి కొద్దిరోజుల క్రితమే నిశ్చితార్థం జరగాల్సి ఉన్నప్పటికీ లక్ష్మీ ప్రణతి మైనర్ అంటూ అభ్యంతరాలు తలెత్తడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు ప్రణతి మేజర్ కావడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీర్ (26) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మేనకోడలు మల్లిక, స్టూడియో చానల్ చైర్మన్ నార్నే శ్రీనివాస రావు కుమార్తె నార్నే లక్ష్మీ ప్రణతి(19) ఈ రోజు(01.04.10) ఉదయం వివాహ నిశ్చతార్ధ మహొత్సవం హోటల్ నొవొటల్, హైదరాబాదులో కన్నుల పండుగ గా జరిగింది. ఈ నిశ్చితార్థ మహొత్సవానికి రెండు వైపుల నుండి బందువులు, స్నేహితులను ఆహ్వానం పలికి వారి మద్య జరగటం విశేషం. నిశ్చితార్ధం కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీ నుండి దిల్ రాజు, వివి వినాయక్, రాజమౌళి, మెహర్ రమేష్ అశ్వినీ దత్ తదితరులు హాజరైనట్టు సమాచారం. జూ ఎన్టీఆర్ పెళ్ళి వేడుకని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మానంలో రూపొందుతున్న చిత్రం ' బృందావనం"(గోవిందుడు అందరి వాడేలే) పూర్తి చేయుటకు షూటింగ్ షరవేగంగా రూపుదిద్దుకొంటున్నది. ఇందులో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu