»   » యువర్స్ లవింగ్లీ టీజర్ విడుదల

యువర్స్ లవింగ్లీ టీజర్ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

పొట్లూరి స్టూడియోస్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి "జో" దర్శకత్వంలో.. పృధ్వి పొట్లూరి-సౌమ్య శెట్టి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మెసేజ్ ఓరియంటెడ్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ "యువర్స్ లవింగ్లీ".
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ ప్రముఖ నిర్మాతలు వల్లూరిపల్లి రమేష్-బెక్కెం వేణుగోపాల్ (గోపి) విడుదల చేశారు.

రామానాయుడు ప్రివ్యూ ధియేటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో.. చిత్ర దర్శకుడు జో, హీరో కమ్ ప్రొడ్యూసర్ పృథ్వి పొట్లూరి (ఎన్ ఆర్ ఐ), హీరోయిన్ సౌమ్యశెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కొడకండ్ల, ఎడిటర్ వి.ఎస్.నాగిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కాండ్రేగుల పాల్గొన్నారు.
టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని.. సినిమా హిట్టయి అందరికీ మంచి పేరు తీసుకురావాలని బెక్కెం వేణుగోపాల్(గోపి), వల్లూరిపల్లి రమేష్ అన్నారు.

Yours Lovingly Movie Motion Teaser relased

ఎన్ ఆర్ ఐ అయిన హీరో కం ప్రొడ్యూసర్ పృథ్వి పొట్లూరికి ఈ చిత్రం మంచి బిగినింగ్ ఇవ్వాలని వారు అభిలాషించారు.

పిల్లలతో పాటు పెద్దలంతా చూడాల్సిన సినిమాగా రూపొందిన "యువర్స్ లవింగ్లీ" చిత్రాన్ని అక్టోబర్ రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర బృందం తెలిపింది.

తమ చిత్రం మోషన్ పోస్టర్ కు మూడున్నర లక్షల పై చిలుకు డిజిటల్ వ్యూస్ వచ్చాయని.. టీజర్ కి అంతకంటే ఎక్కువ స్పందన వస్తుందని ఆశిస్తున్నామని వారు అన్నారు.

బుల్ బుల్, అనిల్, గోవింద్, ప్రియ, మేఘన, సంధ్య, సుజాత, తులసి, బృంద, ఎఫ్ ఎం బాబాయ్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు!

English summary
#YoursLovingly Movie stars Prudhvi Potluri, Sowmya Shetty in lead roles. Directed by Jo, Produced by Prudhvi Potluri. This movies released by producers Valluripalli Ramesh and Bekkam Venu Gopal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X