»   » మసాలా సీన్లతో ‘యూత్‌ఫుల్ లవ్’(ఫోటోలు)

మసాలా సీన్లతో ‘యూత్‌ఫుల్ లవ్’(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' ఫేం మనోజ్‌నందం, రాధారం శ్రీకాంత్, ప్రియదర్శిని, మైధిలి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం 'యూత్‌ఫుల్ లవ్'. వేముగంటి దర్శకుడు. రాధారం రాజలింగం నిర్మాత. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ప్రచార చిత్రాలు ఆసక్తి రేపుతున్నాయి.

యూత్‌ను ఆకట్టుకునేందుకు హీరో హీరోయిన్ల మధ్య మసాలాసీన్లు ప్లాన్ చేసారు. లిప్ లాక్ సీన్లు కూడా ఉన్నట్లు ప్రచార చిత్రాల్లో చూపడం ద్వారా వీలైంనంత ఎక్కువ మంది యూత్‌ను ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాల్సిందిగా దర్శక నిర్మాతల ప్లాన్ గా స్పష్టం అవుతోంది.

సినిమా‌కు సంబంధించిన ప్రచార చిత్రాలు, సినిమా గురించి దర్శక నిర్మాతలు చెప్పిన వివరాలను స్లైడ్ షోలో చూద్దాం...

యువతరం గురించి

యువతరం గురించి


దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ ''ప్రస్తుతం యువతరం గొడవపడే విషయంలో ఆలోచనలు ఎలా ఉంటున్నాయనేది చూపెడుతూ మార్షల్‌ ఆర్స్ట్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కథ నడుస్తుందని తెలిపారు.

షూటింగ్

షూటింగ్


హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు... కులుమనాలి, బ్యాంకాక్‌, థాయిలాండ్‌‌లో కూడా కొన్ని సీన్లు, సాంగులు షూట్ చేసారు.

మార్షల్ ఆర్ట్స్

మార్షల్ ఆర్ట్స్


నిర్మాత రాధారాం మాట్లాడుతూ ''స్త్రీలపై జరిగే అఘూయిత్యాలు జరగకుండా వుండాలంటే వారు కూడా ఆత్మరక్షణార్ధం కరాటే,కుంగ్‌ఫూ లు నేర్చకుంటే ఎలా వుంటుంది. ఆ నేపథ్యంతో సాగే చిత్రమని తెలిపారు.

భాను చందర్, థ్రిల్లర్ మంజు

భాను చందర్, థ్రిల్లర్ మంజు


భానుచందర్‌, థ్రిల్లర్‌ మంజు ఈచిత్రంలో మార్షల్ ఆర్ట్స్ కోచ్‌లుగా నటిస్తున్నారు.

మనోజ్‌నందం

మనోజ్‌నందం


హీరో మనోజ్‌నందం మాట్లాడుతూ ''ఎప్పట్నించో ఇలాంటి చిత్రాలు చేయాలను కుంటున్నాను. ఈ చిత్రం చూసి కొంత మందైనా ఆదర్శంగా తీసుకుంటారు అనుకొంటున్నాను'' అన్నారు.

తారాగణం, టెక్నీషియన్స్

తారాగణం, టెక్నీషియన్స్


రాధారం శ్రీకాంత్‌, మైథిలి, భానుచందర్‌, థ్రి ల్లర్‌ మంజు, చలపతిరావు, బ్రహ్మానందం, అలీ, కృష్ణభగవాన్‌, చిత్రం శ్రీను, హర్షవర్థన్‌, వాసు ఇంటూరి, తాగుబోతు రమేష్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: రాజేష్‌ సాయి, పాటలు: శ్రేష్ఠ, ఛాయాగ్రహణం: సి. శ్రావణ్‌ కుమార్‌, సంగీతం: శ్రీకాంత్‌ దేవా.

English summary
The Audio of the movie ‘Youthful Love’ was launched on 29th of November 2013 at Prasad Labs,Hyderabad. Damodar Prasad of Ranjith Movies released the Audio CD and presented it to Sunilkumar Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu