»   » బాబోయ్...ఈ బూతులేంటి? : ట్రైలరే ఇంత వల్గర్ గా ఉంటే, చూస్తే పెద్ద బ్యానర్

బాబోయ్...ఈ బూతులేంటి? : ట్రైలరే ఇంత వల్గర్ గా ఉంటే, చూస్తే పెద్ద బ్యానర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: యాష్ రాజ్ ఫిలింస్ గురించి తెలియంది ఎవరికి. సూపర్ స్టార్స్ అందరితో బ్లాక్ బస్టర్స్ తీసిన ఈ బ్యానర్ ఇప్పుడు ఓ వెబ్ సీరిస్ లోనూ డబ్బులు ఉన్నాయని అర్దం చేసుకుంది. తమ యూట్యూబ్ మార్కెట్ ని పూర్తి స్దాయి లో డబ్బులు చేసుకుందామని రంగంలోకి దిగింది. అయితే అలాంటి, ఇలాంటి సీరిస్ చేస్తే మిగతా వారికి తమకీ తేడా ఏముంటుంది అనుకుంది.

అందుకేనేమో లేడీస్ రూమ్ అంటూ ఓ వెబ్ సీరిస్ లో రంగంలోకి దూకి, ట్రైలర్ వదిలింది. ఈ ట్రైలర్ చూసిన వారు షాక్ అవుతున్నారు. ఇందులో ఫచ్, బెంచూద్, చూతే వంటి బూతులు విచ్చలివిడిగా ఉన్నాయి. వెబ్ వీడియాలకు సెన్సార్ ఉండదని రెచ్చిపోయిన్నట్లున్నారు.

పూర్తి బూతులతో ఈ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు మిక్సెడ్ రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది అడ్వాన్సెడ్ ధాట్ అని మెచ్చుకుంటూంటే, ఇంత పెద్ద బ్యానర్, ఇదేం పని అని తిడుతున్నారు. మీరు తిట్టినా, పొగిడినా చూడటం తప్పదంటున్నారు.

YRF comes up with new short film based on ‘Ladies Room’

అలాగే ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ లో నా బూంబ్స్ ..ఇలా పెరిగిపోతున్నాయేంటే అంటూ డైలాగులు ఉండటం కూడా షాక్ ఇస్తోంది. ఇక ఈ వెబ్ సీరీస్ లో నటించిన ఆమె తెలుగువారికి పరిచయమే. ఆమె మరెవరో కాదు శ్రేయ ధన్వంతరి.

శ్రేయ ధన్వంతరి..ఎక్కడో విన్నాం ఈ పేరు అంటారు.. అవును..తెలుగులో ఆమె లగడపాటి శ్రీదర్ నిర్మించగా మధురాశ్రీధర్ డైరక్ట్ చేసిన స్నేహగీతం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత నాగచైతన్య లాంచ్ చిత్రం జోష్ లోనూ ఓ ఫ్రెండ్ క్యారక్టర్ లో కనిపించింది. ఆ తర్వాత ఇక్కడ ఆఫర్స్ రాక బాలీవుడ్ చెక్కేసి, మళ్లీ చాలా కాలం తర్వాత మనకు ఇదిగో ఇలా బూతులతో దర్శనమిచ్చింది.

English summary
Yash Raj Films (YRF) has come out with new web series named “Ladies Room”. It’s a story about two best friends with questionable life skills boldly going where no man has gone before – the women’s washroom.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu