»   » వైఎస్ఆర్ పాత్రలో మమ్మూట్టి.. జూన్ 20 నుంచి షూటింగ్

వైఎస్ఆర్ పాత్రలో మమ్మూట్టి.. జూన్ 20 నుంచి షూటింగ్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి గా రాష్ట్ర‌రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బ‌యోపిక్ లొ మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ బ‌యెపిక్ చెప్పిన విదానం న‌చ్చి చాలా గ్యాప్ త‌రువాత మమ్మూట్టి ఈ తెలుగు లో న‌టిస్తున్నారు. ముఖ్యంగా మ‌డ‌మ‌తిప్ప‌ని పాత్ర కావ‌టం వ‌ల‌న Dr. y.s.రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బాడీలాంగ్వేజ్ ని బాగా అవ‌గాహ‌న ప‌ట్టి, పూర్తి డెడికేష‌న్ తో ఈ పాత్ర‌లో ఆయ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన మెద‌టి లుక్ కి రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుండి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌టంతో మ‌మ్మూట్టి గారు కూడా ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గోంటారు.

  క‌థ‌ని న‌మ్మి ఫ్యాష‌నేట్ గా చిత్రాలు నిర్మిస్తున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ 

  సినిమాని వ్యాపారంగా కాకుండా ఫ్యాష‌న్ గా చిత్రాలు నిర్మించే నిర్మాణ సంస్థ‌లు తెలుగు ఇండ‌స్ట్రిలో చాలా త‌క్కువుగా వున్నాయి. ఆ కోవ‌లోకి వ‌చ్చే మ‌రో నిర్మాణ సంస్థ 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ . ఈ బ్యాన‌ర్ పై మెద‌టి ప్ర‌య‌త్నంగా నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి లు సంయుక్తంగా భ‌లేమంచిరోజు అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా డిఫెరెంట్ స్క్రీన్‌ప్లే తొ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపోందించి విజ‌యాన్ని సాధించారు.

  క‌థ‌ని న‌మ్మి బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. అలాగే రెండ‌వ ప్ర‌య‌త్రంగా తాప్సి ని హీరోయిన్ గా పెట్టి , న‌లుగురు క‌మెడియ‌న్స్ ని మెయిన్ పాత్ర‌ల్లో తీసుకుని ఆనందో బ్ర‌హ్మని నిర్మించారు. ఈ చిత్రాన్ని మ‌నుషుల్ని చూసి దెయ్యాలు బ‌య‌ప‌డే ఓ హిలిరియ‌స్ కాన్సెప్ట్ తో చిత్రాన్ని తెర‌కెక్కించారు.

  YSR Biopic: Shooting starts from June 20th

  2017 లొ చిన్న చిత్రాల్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్ప‌డు మ‌రో మెట్టు ఎక్కి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత డాక్ట‌ర్‌. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో డా..వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి పాత్ర‌లో మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్నారు. మమ్మూట్టి తెలుగు లో చాలా కాలం త‌రువాత న‌టించ‌డం విశేషం.

  వైఎస్ఆర్ బయోపిక్ జూన్ 20 నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ లాంగ్ షెడ్యూల్ లో చిత్రీక‌రిస్తున్నారు. 2003 లో డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద వాళ్ళ క‌ష్టాల్ని స్వ‌యంగా తెలుసుకోవ‌టానికి క‌డ‌ప దాటి వ‌స్తున్నా.. మీ గ‌డ‌ప క‌ష్టాలు విన‌టానికి అనే నినాదంతొ ఆయ‌న యాత్ర ఎలా స్టార్టు చేశారో.. ఇప్పుడు ఈ యాత్ర చిత్రం కూడా అదే విధంగా నాన్ స్టాప్ షెడ్యూల్ చేస్తున్నారు.

  తెలుగు సినిమా ఇండ‌స్ట్రిలో ఇదే లాంగెస్ట్ షెడ్యూల్ గా కూడా చెప్ప‌వ‌చ్చు. 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై వ‌స్తున్న చిత్రాల‌కి మంచి ఆద‌ర‌ణ వుంది ఆడియ‌న్స్ లో మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ వున్నాయి. ఈ చిత్రం కూడా వారి అంచ‌నాలు అందుకునేలా వుండ‌బోతుంది. అంతేకాదు వాళ్ళ నాయ‌కుడ్ని మ‌రోక్క‌సారి స్మ‌రించుకునేలా ఈ చిత్రం అంద‌రిని ఆక‌ట్ట‌కుంటుంది.

  ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ

  60 రొజుల్లో 1500 కిలోమీట‌ర్స్ కాలి న‌డ‌క‌తో క‌డ‌ప దాటి ప్ర‌తి ఇంటి గ‌డ‌పలొకి వెళ్ళి పేద‌వాడి క‌ష్టాన్ని, అక్క‌చెల్లెళ్ళ భాద‌ల్ని, రైతుల ఆవేద‌న‌ని చూసి వారితో క‌ల‌సి న‌డిసి వారి గుండె చ‌ప్పుడుగా మారి వారి క‌ష్టాల్ని త‌న క‌ళ్ళ‌తో చూసి బ‌రువెక్కిన గుండెతో ప్ర‌జ‌ల హ్రుద‌యాల్లో స్థానం సంపాయించిన ఎకైన నాయ‌కుడు దివంగ‌త నేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు.. ఆయ‌న బ‌యెపిక్ ని ఆయ‌న ఇమేజ్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా చిత్రీక‌రిస్తాము. మా బ్యాన‌ర్ 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ లో ఎప్పుడూ కాంప్ర‌మైజ్ అయ్యి చిత్రాలు తీయ‌లేదు. మా గ‌త రెండు చిత్రాలు కూడా క‌థ డిమాండ్ మేరకు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశాము. అదే విధంగా మేము త‌ల‌పెట్టిన ఈ భారీ సంక‌ల్ప యాత్ర ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కిస్తాము. మా గ‌త రెండు చిత్రాలు మాదిరిగానే మా ప్రోడ‌క్ష‌న్ వాల్యూస్ ని రెట్టింపు చేసేలా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కి అందిస్తాము. అని అన్నారు.

  బ్యాన‌ర్‌- 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
  నిర్మాత‌లు- విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి
  ర‌చ‌న‌-స్క్రీన్‌ప్లే- ద‌ర్శ‌క‌త్వం--- మ‌హి వి రాఘ‌వ‌

  English summary
  YATRA is a tribute to the unrelenting and undying spirit of Dr. YSR. Never before in independent India did one individual change the course of history to such an extent. Dr. YSR undertook a grueling 60-day 1500 kilometer pada”YATRA” in unrelenting summer heat to comprehend the day to day struggles of people.There is no better person to play the role of YSR than national award winning Megastar Mammootty. With over 350 movies to his credit, versatile and extremely talented Mammootty needs no introduction. Mahi V Raghav, director of blockbuster AnandoBrahma, is directing this movie. 70mm Entertainments riding high on the success of blockbuster AnandoBrahma is producing this movie. Producers Vijay Chilla and Shashi Devireddy are going to leave no stone unturned to make sure that this movie matches the legendary personality of Dr. YSR.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more