»   » భర్తపై గృహహింస కేసు పెట్టిన హీరోయిన్

భర్తపై గృహహింస కేసు పెట్టిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Yukta Mookhey
ముంబై : మాజీ ప్రపంచ సుందరి, నటి యుక్తాముఖి తన భర్త ప్రిన్స్ తులి గృహహింసకు పాల్పడుతున్నట్టు పోలీసులకు పిర్యాదు చేసింది. భర్త తనను కొడుతున్నాడని, కష్టాలు పెడుతున్నాడని తన పిర్యాదులో పెర్కొంది అని ఆంబోలి పోలిస్ స్టేషన్ అధికారులు తెలిపారు.

యుక్తాముఖి ఫిర్యాదు మేరకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 498A(క్రూరత్వం మరియు వేధింపులు), సెక్షన్ 377 (అసహజ సెక్స్)ల కింద గురువారం ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఫిర్యాదు అనంతరం యుక్తాముఖికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తులిప్ న్యూయార్క్ బేస్డ్ బిజినెస్ మేన్ మరియు ఫైనాన్సియల్ కన్సల్టెంట్.

గతంలో చాలా సందర్భాల్లో యుక్తాముఖి తన భర్తపై ఇదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ సారి మాత్రం అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. కోర్టు అనుమతి తర్వాతే యుక్తాముఖి భర్తను అరెస్టు చేసే అవకాశం ఉంది. త్వరలో మరి పోలీసులు ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

యుక్తాముఖి విషయానికొస్తే...1999లో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. తర్వాత అనంతరం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఆ మధ్య యుక్తాముఖి ప్రధాన పాత్రలో 'జ్వాలా' అనే తెలుగు చిత్రం ప్రారంభం అయినా అది పూర్తి కాకముందే అటకెక్కింది.

English summary
Former Miss World and actress Yukta Mookhey has lodged an FIR against her husband Prince Tuli for alleged domestic violence, the police said. "In her complaint, Mookhey alleged she had often been beaten up and troubled by her husband Prince Tuli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu