»   » యువన్ శంకర్ రాజా పవన్ కళ్యాణ్ కి హిట్ ఇస్తాడా...!?

యువన్ శంకర్ రాజా పవన్ కళ్యాణ్ కి హిట్ ఇస్తాడా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'తొలి ప్రేమ" చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో 'బాలు" చిత్రాన్ని రూపొందించిన కరుణాకరణ్ మరో చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 'ఉల్లాసంగా..ఉత్సాహంగా, డార్లింగ్" వంటి విజయ వంతమైన చిత్రాల తర్వాత కరుణాకరన్ చేయనున్న చిత్రమిదే కావచ్చు. 'హ్యాపీ" చిత్రానికి సంగీతమందించిన యువన్ శంకర్ రాజాను ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎంచుకోవడానికి కరుణాకరన్ ప్లాన్ చేసుకుంటున్నాడట. అదే గనుక జరిగితే పవన్ తో యువన్ కు ఇదే తొలి చిత్రమౌతుంది. చిరంజీవికి ఇళయరాజా మ్యాజికల్ హిట్స్ ఇచ్చినట్లే ఆయన తమ్ముడు పవన్ కు ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా మ్యూజికల్ హిట్ ఇవ్వగలడో లేదో మరి..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu