»   » తమ్ముడి లాంటి వాడితో సంబంధమా...ప్రీతీజింతా

తమ్ముడి లాంటి వాడితో సంబంధమా...ప్రీతీజింతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటి ప్రీతీ జింతాకి, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు మాజీ కెప్టెన్ యువరాజ్ సింగ్‌ కీ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను ప్రీతీ జింతా కొట్టిపారేసింది. యువరాజ్ సింగ్ తనకు తమ్ముడులాంటి వాడనీ, తన గుండెల్లో అతడిపై ప్రేమాభిమానాలు ఉన్నాయని ెప్పుకొచ్చింది. మరైతే సోదరునితో అలా కౌగిలింతలు,ముద్దులు అంటూ ఎగపడరు కదా అని ఓ మీడియా విలేఖరి ముందడగు వేసి అడిగితే.. అందులో తప్పేమీ కనపడచం లేదు....ఆనందం వచ్చినప్పుడు దాన్ని అలా షేర్ చేసుకున్నా. పట్టలేని సంతోషం వచ్చినప్పుడు ఇలా ప్రవర్తించాలని ఎవరూ గిరి గీసుకుని ప్రవర్తించరు. నా టీమ్ సభ్యులందరూ నాకు కుటుంబ సభ్యులు లాంటి వారే. యువరాజ్ చిన్న తమ్ముడు లాంటివాడు అని మళ్ళీ చెప్పింది. అలాగే తాను ఓ బాధ్యత కలిగిన హీరోయిన్‌ని అని, వ్యాంప్‌ను కాదని, అస్సలు ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్ చేయట్లేదని చెప్తూ సీరియస్ గా వెళ్ళిపోయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu