»   » యువరాజ్ సింగ్ జీవితంపై సినిమా, హీరో ఎవరో తెలుసా?

యువరాజ్ సింగ్ జీవితంపై సినిమా, హీరో ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబద్: ప్రముఖులు, క్రీడాకారుల జీవితాలపై వస్తున్న బయోపిక్ లకు బాక్సాఫీసు వద్ద మంచి స్పందన వస్తోంది. గతంలో వచ్చిన భాగ్ మిల్ఖా భాగ్, మేరికోమ్, ఇటీవల వచ్చిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ 'ఎంఎస్ ధోనీ' బాక్సాపీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. మరో వైపు సచిన్ జీవితంపై వస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉంది.

తాజాగా మరో స్టార్ క్రికెటర్ జీవితంపై సినిమా చేసేందుకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో యువరాజ్ సింగ్ ఒకరు.... ఇపుడు ఇతడి జీవితం మీదనే సినిమా చేయబోతున్నారట.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

అయితే ఈ సినిమా ఎవరు ప్లాన్ చేస్తున్నారు? ఎవరు నిర్మిస్తున్నారనే విషయం ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు. అయితే హీరో పేరు బయటకు వచ్చింది. అక్షయ్ కుమార్ తో ఈ సినినిమా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. యువరాజ్ సింగ్ కోరిక కూడా అక్షయ్ కుమార్ నటించాలనే.

యువరాజ్

యువరాజ్

యువరాజ్ సింగ్ జీవితం ఎంతో ఆసక్తికరం... టీమిండియాలోకి ఓ సంచలనంలా దూసుకొచ్చిన యూవీ ఇండియాకు వరల్డ్ కంప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ ఆటగాడి ఉన్న సమయం క్యాన్సర్‌ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. క్యాన్సర్ ను జయించి మళ్లీ జట్టులోకి చేరారు. యూవీకి ఆటతో పాటు లవ్ ఎఫైర్లు కూడా ఎక్కువే ఇవన్నీ సినిమాలో చూపించబోతున్నారట.

 యువీ హనీమూన్ నుండి వచ్చిన తర్వాత ప్రకటన

యువీ హనీమూన్ నుండి వచ్చిన తర్వాత ప్రకటన

యువరాజ్ సింగ్ ఇటీవలే తన ప్రియురాలు హజల్ కీచ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. యవరాజ్ హనీమూన్ నుండి తిరిగి వచ్చాక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. యువరాజ్ సింగ్ పెళ్లి తొలుత సిక్కు సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఫోటోల కోసం క్లిక్ చేయండి

గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం

గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం

హజల్ కీచ్ హిందూ కావడంతో..... సిక్కు సాంప్రదాయంలో పెళ్లయిన తర్వాత గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
Bollywood source said that, Team india cricketer Yuvraj Singh's story to be turned into a biopic soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu