twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత మాయ... ఆ రెండు పెద్ద సినిమాలు డీలా!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గౌతం మీనన్ దర్శకత్వంలో నాని-సమంత జంటగా రూపొందిన చిత్రం 'ఎటో వెళ్లి పోయింది మనసు' ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుందంటే ఇదంతా.... సమంత గతంలో నటించిన 'ఏమాయ చేసేవె' చిత్రం ఎఫెక్ట్ అనే చెప్పక తప్పదు. ఆ రేంజిలో సినిమా ఉంటుందనే భావనతో సగటు ప్రేక్షకుడు థియేటర్ కు వస్తున్నాడు. అయితే సినిమా ఆ రేంజిలో లేక పోవడం, కాస్త స్లోగా ఉండటంతో వారిని కాస్త నిరాశ పరుస్తుంది. అయితే ఇళయరాజా మ్యూజిక్, సమంత, నాని పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్సయ్యాయి. ప్రస్తుతం బరిలో పెద్ద సినిమాలేవీ లేక పోవడంతో బాక్సాఫీసు వద్ద మంచి ఈ చిత్రం తన జోరు కొనసాగిస్తోంది.

    ఆ సంగతి పక్కన పెడితే.... ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. సమంత మాయలో పడిన ప్రేక్షకులంతా ఈ సినిమా వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో ఇప్పటికే విడుదలైన రెండు బాలీవుడ్ పెద్ద చిత్రాలు అమీర్ ఖాన్ 'తలాష్', అక్షయ్ కుమార్ 'కిలాడి 786'లపై ఎఫెక్ట్ పడుతోంది.

    యూఎస్ బాక్సీఫీసు నుంచి అందిన వివరాల ప్రకారం... తలాష్ చిత్రం నవంబర్ 29న అమెరికాలో భారీ ఎత్తున రిలీజైంది. మంచి బిజినెస్ కూడా చేసింది. అమీర్ ఖాన్, కరీనా కపూర్, రాణి ముఖర్జీ నటించిన ఈచిత్రం అక్కడ 113 స్క్రీన్లలో విడుదలై మూడో వారంలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. 18 రోజుల్లో ఈచిత్రం అక్కడ $27,06,375 (రూ.14.80కోట్లు) వసూలు చేసింది. అక్షయ్ కుమార్, అసిన్ జంటగా నటించిన కిలాడీ 786 చిత్రం డిసెంబర్ 7న 115 స్క్రీన్లలో విడుదలై 11 రోజుల్లో దాదాపు ఇప్పటి వరకు $3,52,684 (రూ 1.93 కోట్లు) వసూలు చేసింది.

    నాని-సమంత జంటగా గౌతం మీనన్ దర్శకత్వంలో రూపొందిన రూపొందిన 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం డిసెంబర్ 14న కేవలం 43 స్క్రీన్లలో విడుదలైంది. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించింది. $1,80,510 (రూ 98.74 లక్షలు) వసూలు చేసింది. అదే విధంగా 'ఎటో వెళ్లి పోయింది మనసు' తమిళ వెర్షన్ కూడా యూఎస్ బాక్సీఫీసు వద్ద మంచి బిజినెస్ చేస్తోంది. తమిళ వెర్షన్ తొలి మూడు రోజుల్లో $92,102 (రూ 50.38 లక్షలు) వసూలు చేసింది.

    English summary
    Director Gautam Menon's latest venture Yeto Vellipoyindi Manasu has got very good opening in America. The Telugu film has done even better collection than its Tamil version Neethaane En Ponvasantham. That's not all. It has even slowed down the collection of Hindi movies Talaash and Khiladi 786, which had done fantastic business at the USA Box Office in the last week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X