For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నా భూమిలోకి వెళ్లకుండా దౌర్జన్యం.. మోహన్‌బాబుకు వైవీస్ చౌదరీ లీగల్ నోటీసు..

  |
  Director YVS Chowdary Sends Legal Notice To Mohan Babu Over Land Dispute || Filmibeat Telugu

  సలీం సినిమా వివాదం డైలాగ్ కింగ్ మోహన్ బాబు, దర్శకుడు వైవీఎస్ చౌదరీ మధ్య మరింత చిచ్చు పెట్టే పరిస్థితి కనిపిస్తున్నది. గతవారం మంచు మోహన్‌బాబుకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు జరిమానాతోపాటు ఏడాది శిక్ష కూడా విధించడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఏ1గా లక్ష్మీప్రసన్న పిక్చర్స్, ఏ2 గా మోహన్ బాబును పేర్కొన్నది. మోహన్ బాబుకు ఏడాది జైలుశిక్షతో పాటు 41 లక్షల జరిమానా విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. మూడు నెలల వ్యవధిలో జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో తనపై ఆరోపణలు చేసిన మోహన్ బాబుకు దర్శకుడు వైవీఎస్ చౌదరీ లీగల్ నోటీసుల జారీ చేయడం ఈ వివాదం మరింత ముదిరింది. వివరాల్లోకి వెళితే

  మోహన్ బాబు ఈ కేసు తీర్పు వివరణ ఇస్తూ.. '2009లో 'స‌లీమ్' సినిమా చేస్తున్న స‌మయంలో ఆ చిత్రానికి సంబంధించిన పారితోషికాన్ని ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రికి చెల్లించేశాం. మా బ్యాన‌ర్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికిగానూ ఆయ‌న‌కు రూ.40ల‌క్ష‌ల చెక్ ఇచ్చాం. అయితే స‌లీమ్ మూవీ ఊహించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో వైవీఎస్ చౌద‌రితో త‌దుప‌రి చేయాల్సిన సినిమాను వ‌ద్ద‌నుకున్నాం అని అలాగే చెక్‌ను బ్యాంకులో వేయ‌వ‌ద్ద‌ని కూడా చెప్పాం. అయినా కూడా కావాల‌నే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ను బౌన్స్ చేశారు అని మోహన్ బాబు ఆరోపించారు.

   కోర్టును తప్పుదోవ పట్టించారని

  కోర్టును తప్పుదోవ పట్టించారని

  సినిమా చేయడం లేదని చెప్పినా చెక్ డిపాజిట్ చేశాడు. ఆపై నా మీద చెక్ బౌన్స్‌ కేసు వేశారు. ఈ వ్యవహారంలో కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. ఈ తీర్పుని మేం సెష‌న్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని ఛానెల్స్‌లో నాపై వ‌స్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మ‌వద్దు అని మోహన్‌బాబు అన్నారు.

  తప్పుదోవ పట్టించినట్టుగా

  తప్పుదోవ పట్టించినట్టుగా

  అయితే మోహన్ బాబు చేసిన ఆరోపణలపై మనస్తాపం చెందిన వైవీఎస్ చౌదరీ తాజాగా నోటీసులు జారీ చేశారు. మోహన్‌బాబు బాకీ పడ్డ రూ. 40,50,000 చెక్‌ కోసం, నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. దాదాపు 9 సంవత్సరాల అనంతరం '23వ స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు' ఎర్రమంజిల్‌, హైదరాబాద్‌ వారు.. 2 ఏప్రిల్‌ 2019న నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అనంతరం సదరు న్యాయసానాన్ని నేను తప్పుదోవ పట్టించినట్లుగా తీర్పు వెలువడిన తదనంతర పత్రికా ప్రకటనలో మోహన్‌బాబు పేర్కొనడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

  నా స్థలంలోకి రానీయ్యకుండా అడ్డుకొంటున్నారు..

  నా స్థలంలోకి రానీయ్యకుండా అడ్డుకొంటున్నారు..

  కోర్టు తీర్పు తర్వాత మోహన్‌బాబు‌ జల్‌పల్లి గ్రామం, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇంటిని ఆనుకొని, నా ఇంటి నిర్మాణానికై 'సలీమ్‌' చిత్ర నిర్మాణ సమయంలోనే నేను కొనుక్కున్న అర ఎకరం స్థలంలోకి నన్ను, నా మనుషుల్ని నా స్థలంలోకే రానీకుండా అడ్డుకోవడం, ఆటంకాలు కల్పించడం తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది.

  లీగల్ నోటీసు జారీ చేస్తున్నాను

  లీగల్ నోటీసు జారీ చేస్తున్నాను

  నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న నా ఇంటి స్థలం విషయంలో ఆయన సమస్యలు సృష్టిస్తుండటంతో, ఇన్నేళ్లుగా జరిగిన, జరుగుతున్న ఉదంతాలపై శాశ్వత పరిష్కారం కోసం నేను న్యాయనిపుణులను ఆశ్రయించడమైనది. పూర్తి వివరాలకై మా న్యాయవాదులు ఆయనకు పంపిన లీగల్‌ నోటీసును మీడియాకు అందజేస్తున్నాను అని వైవీఎస్ చౌదరీ అన్నారు.

  English summary
  Actor Mohan Babu Gets One Year Jail Term in Check Bounce Case. Director YVS Chowdary files this case on Mohan Babu in 2010. It is issue on Manchu Vishnu's Saleem movie directed by YVS Chowdary. In this contraversy, YVS chowdary has sent legal notice to Mohan babu
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more