»   » ‘రేయ్’పై షాకింగ్ వార్తలు? చౌదరికి ముందే తెలుసా?

‘రేయ్’పై షాకింగ్ వార్తలు? చౌదరికి ముందే తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘రేయ్' సినిమా విడుదల అవ్వనేలేదు....అప్పుడే నష్టం లెక్క ఎంత తేలుతుంది అనే చర్చ ఫిల్మ్ నగర్లో సాగుతోంది. సాధారణ ప్రేక్షకులకు ఇలాంటి వార్తలు షాకింగ్‌గా అనిపించవచ్చు కానీ.... ఫిల్మ్ జనాల్లో మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా పరిశ్రమ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం....‘రేయ్' సినిమా వల్ల తనకు మిగిలేది నష్టాలే అని వైవిఎస్ ముందే ఫిక్స్ అయ్యారని....అంటున్నారు.

వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘రేయ్' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం ఎట్టకేలకు అన్ని అడ్డకులు తొలగించుకుని ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి చాలా అప్పు చేసారు. సినిమా చాలా లేటు కావడంతో వడ్డీతో కలిపి రూ. 40 కోట్లకు చేరుకుందట.

YVS Chowdary Is Ready To Lose Many Crores!

సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వేలేని జీవితం' ఇటీవల విడుదలై హిట్ టాక్ రావడంతో దాదాపు 11 కోట్లు వసూలు చేసింది. ‘రేయ్' సినిమా విడుదలై మంచి హిట్ టాక్ వచ్చినా 15 కోట్లకు మించి రావనేది మార్కెట్ వర్గాల అంచనా. సినిమాకు ‘ఎ' సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి కూడా తక్కువే అంటున్నారు.

మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘రేయ్' సినిమా ఎలాంటి ఫలితాలను ఇస్తుంది. వైవిఎస్ చౌదరి....ఇన్నేల్ల కష్టానికి ఎలాంటి ప్రతిఫలం అందుకోబోతున్నారు అనేది హాట్ టాపిక్ అయింది. వైవిఎస్ ‘రేయ్' సినిమా విషయంలో పడ్డ కష్టాలను చూసిన వారంతా ఆయన సేఫ్ గా గట్టెక్కాలని కోరుకుంటున్నారు.

Read more about: rey, yvs chowdary
English summary
As per unofficial reports, the production cost of Rey has gone up to 40 crores including the interests on the finances.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu