»   »  రామ్ చరణ్ కు వైవియస్ చౌదరి స్పెషల్ గిప్ట్

రామ్ చరణ్ కు వైవియస్ చౌదరి స్పెషల్ గిప్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ కు దర్శకుడు వైవియస్ చౌదరి ఆయన పుట్టిన రోజు ఓ స్పెషల్ గిప్ట్ ఇవ్వనున్నారు. అది మరేదో కాదు...మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ హీరోగా తన దర్శకత్వంలో రూపొందిన రేయ్ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న విడుదల చేయటానికి నిర్ణయించారు. అక్టోబర్ 17 2010 న ప్రారంభమైన ఈ చిత్రం ఇన్నాళ్లకు అన్ని అడ్డంకులూ తప్పించుకుని విడుదలకు సిద్దమవుతోంది. అలాగే ఈ చిత్రంలో చిరంజీవి సూపర్ హిటమ్ సాంగ్ గోలీమార్ ని రీమేక్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే. దాంతో మెగాభిమానులంతా ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం విషయానికి వస్తే...

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రం 'రేయ్‌'. సయామి ఖేర్‌, శ్రద్ధాదాస్‌ హీరోయిన్స్. వైవీఎస్‌ చౌదరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. ఈ నెల 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అక్కడ ఈ విషయం ప్రకటించారు.

వైవీయస్‌ చౌదరి కుమార్తె, చిత్ర సహనిర్మాత యుక్త మాట్లాడుతూ ''నాన్నగారికి ఎన్ని అవరోధాలొచ్చినా ఎదుర్కొని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో నేను కథానాయకుడి చెల్లెలిగా నటించా'' అని చెప్పారు.

దర్శకనిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా ప్రథమార్ధం వెస్టిండీస్‌, ద్వితీయార్ధం అమెరికాలో సాగుతుంది. 'రేయ్‌' అనిపించుకునే కుర్రాడు ఓ అందమైన అమ్మాయి వల్ల ప్రేమ గొప్పతనాన్ని తెలుసుకొంటాడు. ఆ తర్వాత తన ప్రియురాల్ని సమస్యల నుంచి గట్టెక్కించడం కోసం ఎలాంటి పోరాటం చేశాడన్నది ఈ కథ. పాటలు వింటుంటే మళ్లీ ప్రేక్షకుల మదిలో చక్రి మెదులుతాడు. ఒక మంచి సినిమా చూశామనే తృప్తి ప్రేక్షకులకు కలిగేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. పది సినిమాల అనుభవమున్న నటుడిలా సాయిధరమ్‌ తేజ్‌ నటించాడు. యుక్త చిన్నప్పటి ఇలియానాగా 'దేవదాస్‌'లో నటించింది. ఆ చిత్రం ఘన విజయం పొందింది. ఇందులో హీరోకి చెల్లిగా నటించింది. 'దేవదాస్‌'లాగే ఈ చిత్రమూ విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది''న్నారు

Yvs Chowday’s special gift to Ram Charan

సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ ''నా తొలి ఫొటో షూట్‌ మార్చి 27, 2010న జరిగింది. మార్చి 27, 2012న సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. మార్చి27, 2015న సినిమా విడుదలవుతోంది. ఇలా నా జీవితంలో మార్చి 27కు ఎంతో ప్రాధాన్యముంది. అడ్డంకుల్ని అధిగమించి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు వైవీయస్‌ చౌదరి. ఆయనతో మరో సినిమా చేయడానికి నేను సిద్ధమ''న్నారు.

''రేయ్‌.. రామ్‌చరణ్‌ కోసం రాసుకొన్న కథ. అయితే సాయిధరమ్‌తేజ్‌లో ఒకప్పటి చిరంజీవిగారి పోలికలు కనిపించాయి. అందుకే తనతో ఈ సినిమా తెరకెక్కించా'' అంటున్నారు వైవీఎస్‌ చౌదరి. ఆయన నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'రేయ్‌'. సాయిధరమ్‌తేజ్‌, సయామీఖేర్‌ జంటగా నటించారు. శ్రద్దాదాస్‌ కీలక పాత్రధారి.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''నాకు శిరీష్‌ ఎంతో సాయీ అంతే. చిన్నప్పటి నుంచీ తనకి సినిమాలంటే పిచ్చి. 'సాయిని హీరోని చేసేద్దామా?' అని చరణ్‌ని చాలాసార్లు అడిగా. 'వాడు బుద్ధిగా చదువుకొంటున్నాడు కదా.. వదిలేయ్‌' అన్నాడు. తీరా చూస్తే 'రేయ్‌' సినిమా చేసేశాడు. సాయిని హీరోగా మార్చిన వైవిఎస్‌ చౌదరికి కృతజ్ఞతలు'' అన్నారు. ''నా కష్టం వెనుక బన్నీ అందించిన సహకారం చాలా ఉంది. కుదిరితే వైవిఎస్‌ చౌదరితో మరో సినిమా చేస్తా'' అన్నాడు సాయిధరమ్‌ తేజ్‌.

వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.

ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్‌లో సెటిల్‌ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్‌ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్‌, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్‌లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. '' అని తెలిపారు. ఈ చిత్రాన్ని వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఈ విషయాన్ని వైవియస్ చౌదరి మీడియాకు తెలియచేసారు.

అలాగే...''ఈ సినిమాకి చాలా సమయం పట్టింది. దానికి కారణం... ఈ సినిమాలోని విషయం అలాంటిది. సినిమా చూస్తే ఇంతకాలం ఎందుకు పట్టిందో మీకే అర్థం అవుతుంది'' అన్నారు.చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు.
చిత్రానికి మాటలు: శ్రీధర్‌ సీపాన, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌, సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: యలమంచిలి గీత

English summary
The most delayed movie Sai Dharam tej’s debut film ‘Rey’ will be releasing on March 27 th which happens to be the birthday of another mega hero Ram Charan Tej.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu